Monday, December 23, 2024

అధికారంలోకి వస్తే అదానీ గ్రూప్‌పై దర్యాప్తు చేపడతాం : రాహుల్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : బొగ్గు దిగుమతులపై అదానీ గ్రూపు అధిక ఇన్‌వాయిస్‌లతో ప్రజలు విద్యుత్‌కు ఎక్కువ చెల్లించేలా చేస్తోందని, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ఈ క్రమంలో ప్రజలపై రూ. కోట్ల భారం పడుతోందని మీడియాలో వచ్చిన కథనాన్ని ఆయన ఉదహరించారు. దీనిపై దర్యాప్తునకు ప్రధాని నరేంద్రమోడీ ఎందుకు ఆదేశించడం లేదని ప్రశ్నించారు. ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన రాహుల్ , కాంగ్రెస్ అధికారం లోకి వస్తే అదానీ గ్రూప్‌పై దర్యాప్తునకు ఆదేశిస్తామన్నారు.

‘ ఇండోనేషియా నుంచి అదానీ గ్రూప్ బొగ్గు దిగుమతి చేసుకొంది. భారత్‌కు చేరేసరికి దాని ధర రెట్టింపు అవుతోంది. ఇలా అధిక ధరల కారణంగా సామాన్య ప్రజలు విద్యుత్ బిల్లులను భారీగా చెల్లించాల్సి వస్తోంది. దీంతో కొన్ని కాంగ్రెస్ పాలిత ప్రాంతాలు పేదలకు సబ్సిడీలు చెల్లించాల్సి వస్తోంది” అని రాహుల్ గాంధీ ఆరోపించారు. ఒకవేళ కాంగ్రెస్ అధికారం లోకి వస్తే దీనిపై దర్యాప్తు చేస్తారా ? అని విలేఖరులు అడిగిన ప్రశ్నకు తాము అధికారం లోకి వస్తే తప్పకుండా దర్యాప్తునకు ఆదేశిస్తాం ” అని పేర్కొన్నారు.

ఈ వ్యవహారంపై ప్రధాని మోడీ ఎందుకు మౌనంగా ఉంటున్నారని రాహుల్ ప్రశ్నించారు. దర్యాప్త జరిపి వారి విశ్వసనీయతను నిరూపించుకోవాలని అడుగుతున్నానని పేర్కొన్నారు. మార్కెట్ విలువ కంటే ఎక్కువ ధరకు అదానీ గ్రూప్ బొగ్గు దిగుమతి చేసుకున్నట్టు కన్పిస్తోందంట ఫైనాన్షియల్ టైమ్స్ కథనాన్ని రాహుల్ ప్రస్తావిస్తూ ఈ ఆరోపణలు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News