- Advertisement -
దుబాయి : అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) బుధవారం తాజాగా ప్రకటించిన వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తన ర్యాంక్‌ను మెరుగుపరుచుకున్నాడు. ప్రపంచకప్‌లో అద్భుత బ్యాటింగ్‌తో అదరగొడుతున్న రోహిత్ తాజా ర్యాంకింగ్స్‌లో ఏకంగా ఐదు స్థానాలు ఎగబాకి ఆరో ర్యాంక్‌కు చేరుకున్నాడు. కిందటి ర్యాంకింగ్స్‌లో రోహిత్ పదకొండో స్థానంలో ఉన్నాడు. ఇక భారత ఓపెనర్ శుభ్‌మన్ గిల్ రెండో ర్యాంక్‌ను నిలబెట్టుకున్నాడు. పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్ టాప్ ర్యాంక్‌లో కొనసాగుతున్నాడు. సౌతాఫ్రికా స్టార్ డికాక్ మూడో, వాండర్ డుసెన్ నాలుగో ర్యాంక్‌లో నిలిచారు. భారత స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి 8వ ర్యాంక్‌ను దక్కించుకున్నాడు. బౌలింగ్ విభాగంలో న్యూజిలాండ్ స్టార్ ట్రెంట్ బౌల్ట్ అగ్రస్థానాన్ని సొంతం చేసుకున్నాడు.
- Advertisement -