- Advertisement -
పాలస్తీనా: గాజా, వెస్ట్‌బ్యాంక్‌కు అమెరికా బారీ సాయం ప్రకటన చేసింది. 100 మిలియన్ డాలర్ల మానవతా సాయాన్ని అమెరికా ప్రకటించింది. గాజాకు పరిమిత స్థాయిలో మానవతా సాయానికి ఇజ్రాయెల్ అనుమతి ఇచ్చింది. గాజాకు ఆహారం, నీరు, ఔషదాల సరఫరాకు ఈజిప్టుకు ఇజ్రాయెల్ అనుమతి ఇచ్చింది. హమాస్ మిలిటెంట్లకు చేరనంత వరకు సరఫరా అడ్డుకోమని స్పష్టం చేసింది. రపా బార్డర్ క్రాసింగ్ తెరిచేందుకు ఈజిప్ట్ ఒప్పుకుంది. గాజాలోని ఓ ఆస్పత్రిపై క్షిపణితో దాడి చేయడంతో 500 మంది చనిపోగా 900 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. కుప్పకూలిన శిథిలాల కింద వందలాది మంది చిక్కుకున్నట్టు సమాచారం. మృతుల సంఖ్య 1000 దాటుతుందని స్థానిక మీడియా వెల్లడించింది. ఇజ్రాయెల్, హమాస్ ఒకరినొకరు దాడులు చేసుకన్నాయని ఆరోపణలు చేస్తున్నాయి.
Also Read: గురి తప్పిన యుద్ధం మిగిల్చిన దారుణం
- Advertisement -