ముంబయి: ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్ డ్రీమ్ 11లో కోటిన్నర రూపాయలు గెలుచుకున్న ఎస్‌ఐని పోలీస్ శాఖ సస్సెండ్ చేసిన సంఘటన మహారాష్ట్రలోని పింప్రీ-చించ్వాడ్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ఎస్‌ఐ సోమనాథ్ జిండే గత కొన్ని రోజుల నుంచి యాప్ డ్రీమ్11లో క్రికెట్ బెట్టింగ్‌లకు పాల్పడుతున్నాడు. అక్టోబర్ 10న ఇంగ్లాండ్-బంగ్లాదేశ్ మ్యాచ్‌లో బెట్టింగ్ చేశాడు. ఉత్తమ ఆడిన ఆటగాళ్లతో జట్టును ఎంపిక చేశాడు. ఫాంటసీ గేమ్‌లో సదరు ఎస్‌ఐ తొలి స్థానంలో ఉండడంతో రూ.1.5 కోట్లు ఫ్రైజ్ మనీ గెలుచుకున్నాడు. దీంతో ఆయన తన కుటుంబ సభ్యులతో సీట్లు పంచుకొని సంబరాలు చేసుకున్నాడు. నిబంధనలు అతిక్రమించడంతో సదరు ఎస్‌ఐని ఎసిపి సతీశ్ సస్సెండ్ చేశాడు. ఒక వైపు ఇంట్లోకి 1.5 కోట్ల రూపాయాలు రాగా మరో వైపు ఎస్‌ఐ జాబ్ ఊడిపోవడంతో అతడు దు:ఖంలో మునిగిపోయాడు.
Also Read: గద్వాల్ లో ఆరుగురుపై పిచ్చికుక్కల దాడి