Monday, December 23, 2024

5 రోజుల శిశువు అవయవాలతో ముగ్గురికి కొత్త జీవితం

- Advertisement -
- Advertisement -

బ్రెయిన్‌డెడ్ అయిన ఐదు రోజుల శిశువు తన అవయవాలతో ముగ్గురు పిల్లలకు కొత్త జీవితం ఇచ్చింది. శిశువు కాలేయాన్ని తొమ్మిది నెలల చిన్నారికి, రెండు కిడ్నీలను ఇద్దరు పిల్లలకు ట్రాన్స్‌ప్లాంట్ చేశారు. గుజరాత్ లోని సూరత్‌లో ఈ సంఘటన జరిగింది. అక్టోబర్ 13న ప్రైవేట్ ఆస్పత్రిలో పండంటి బాబుకు చేతన జన్మనిచ్చింది. అయితే ఆ దంపతుల సంతోషం కొన్ని గంటలే నిలిచింది. పసిబాబులో ఎలాంటి కదలిక లేదని డాక్టర్లు తెలిపారు. దీంతో మరో ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లగా ఆ శిశువుకు వెంటిలేటర్ అమర్చారు. అయితే ఐదు రోజుల శిశువు బ్రెయిన్ డెడ్ అయినందున బతికే అవకాశం లేదని వైద్యులు ప్రకటించారు.

ఈ నేపథ్యంలో ఎన్జీవో సంస్థ జీవన్‌దీప్ అవయవ దానం ఫౌండేషన్ మేనేజింగ్ ట్రస్టీ విపుల్ ఆ శిశువు తల్లిదండ్రులను కలిసి బ్రెయిన్‌డెడ్ అయిన పసిబాబు అవయవాలు దానం చేయాలని కోరి చివరకు ఒప్పించారు. బుధవారం శిశువు శరీరం నుంచి రెండు మూత్ర పిండాలు, రెండు కార్నియాలు, కాలేయం, ప్లీహాన్ని సేకరించారు. సంబంధిత అవయవాల బ్యాంకులకు వాటిని తరలించారు. మరోవైపు ఢిల్లీకి తరలించిన శిశువు కాలేయాన్ని తొమ్మిది నెలల చిన్నారికి విజయవంతంగా అమర్చారు. అలాగే శిశువు రెండు మూత్రపిండాలు 13, 15 ఏళ్ల పిల్లలకు ట్రాన్స్‌ప్లాంట్ చేయడంతో వారికి కొత్త జీవితం ఇచ్చాయని పీపీ సనాని ఆస్పత్రి డాక్టర్లు గురువారం తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News