Thursday, January 23, 2025

మున్నేరుపై తీగల వంతెన..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రాష్ట్ర రవాణ శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆలోచన,కృషితో ఖమ్మం జిల్లా కేంద్రంలోని మున్నేరుపై తీగల వంతెన నిర్మాణం జరగనుంది.ఖమ్మం ముఖ ద్వారం మున్నేరు నదిపై హైద్రాబాద్ లో దుర్గం చెరువు పై నిర్మించిన తీగల వంతెన మాదిరిగా ఇక్కడ కూడా నిర్మించబోతున్నారు.కాల్వోడ్డు సమీపంలోని వందేళ్ళ చరిత్ర గల బ్రిడ్జి స్దానంలో సామాంతరంగా తీగల వంతెన నిర్మాణం చేయాలని జిల్లాకు చెందిన రాష్ట్ర రవాణ శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ముఖ్యమంత్రికి చేసిన విజ్ణప్తి మేరకు రూ.180 కోట్ల నిధులను విడుదల చేశారు దీనికి సంబంధించి టెండర్ లు కూడా పూర్తయి నిర్మాణ పనులను ప్రారంభించారు.

నాసిక్ కు చెందిన ఒ కంపెనీ ఈ టెండర్ ను దక్కించుకుంది.ఇప్పటికే కోల్‌కత్తా నుంచి వచ్చిన సదరు కంపెనీ సిబ్బంది ఖమ్మం నగరంలో సర్వే కూడా ప్రారంభించారు. సూర్యాపేట ..ఆశ్వారావుపేట జాతీయ రహదారిపై ఖమ్మం నగరంలో కాల్వోడ్డు మున్నేరు పై కి మీ 57/150 నుంచి కి మీ 58/400 వరకు 300 మీటర్ల వరకు బాక్స్ టైప్ బ్రిడ్జి నిర్మాణం చేపట్టనున్నారు.ఈ ఏడాది సెప్టెంబర్ 30న మంత్రి కెటి ఆర్ సమక్షంలో రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి మున్నేరు వద్ద శంకుస్దాపన కూడా చేశారు. ప్రస్తుతం ఖమ్మం నగరంలో లకారం చెరువుపై రూ.10.7కోట్ల వ్యయంతో తీగల వంతెన(సస్పెన్షన్ బ్రిడ్జి) ఉండగా ఇది నిర్మాణం అయితే రెండో తీగల వంతెన అవుతుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News