Monday, December 23, 2024

రాహుల్ గాంధీని పులకరించిన మంథని ప్రజలు

- Advertisement -
- Advertisement -

మంథని రూరల్: కాంగ్రెస్ పార్టీ విజయ భేరి యాత్రకు ప్రజల నుండి విశేషమైన స్పందన లభించింది. మంథని నియోజకవర్గంలో యాత్ర మొదలైనప్పటి నుండి ప్రజల నుండి వస్తున్న స్పందన చూసి రాహుల్ గాందీ ఎంతో ముగ్ధుడయ్యాడు. గ్రామ గ్రామాల్లో ప్రజలు నీరాజనం పలికారు. ప్రతి గ్రామంలోను రోడ్డుకిరువైపులా ఉన్న ప్రజలకు అభివాదం చేస్తూ రాహుల్ గాంధీ ముందుకు సాగారు. మంథని పాత పెట్రోల్ బంకు వద్ద చౌరస్తాకు నలు మూలల జనంతో కిటకిటలాడింది.

ఈ సందర్భంగా రాహుల్ గాంధీ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ ప్రసంగాన్ని మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు తెలుగులో అనువాదం చేశారు. మంథని ఎమ్మెల్యేగా శ్రీధర్ బాబును భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు. నియోజకవర్గంలోని గ్రామాల్లో కాంగ్రెస్ జెండాలు రెపరెపలాడాయి. మంథని మండలంలోని అడవిసోమన్ పల్లి, ఆరెందా, వెంకటాపూర్, బట్టుపల్లి, ఎగ్లాస్‌పూర్, మంథని, గంగాపూరి, కూచిరాజుపల్లి, శ్రీరాంనగర్, పుట్టపాక, రామయ్యపల్లి, వేంపాడు, ఆదివారం పేట, లద్నాపూర్, బేగంపేట గ్రామాల్లోని ప్రజలు రాహుల్ గాంధీ విజయభేరి యాత్రకు ఘన స్వాగతం పలికారు. రాహుల్ గాంధీ వెంట పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, శాసన సభ పక్ష నాయకుడు బట్టి విక్రమార్క, మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News