- Advertisement -
కర్నాటక హైకోర్టు కీలక ఆదేశాలు
బెంగళూరు : కర్నాటక ఉపముఖ్యమంత్రి, కాంగ్రెస్ ప్రముఖ నేత డికె శివకుమార్‌కు గురువారం కర్నాటక హైకోర్టులో చుక్కెదురైంది. లెక్కల్లోకి రాని, ఆదాయానికి మించిన ఆస్తులపై సిబిఐ తనపై దాఖలు చేసిన కేసును కొట్టివేయాలని డికె క్యాష్ పిటిషన్ పెట్టుకున్నారు. దీనిని విచారించిన హైకోర్టు ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసిన తరువాత గురువారం వెలువరించింది. క్వాష్ పిటిషన్‌ను తోసిపుచ్చుతున్నట్లు న్యాయమూర్తి కె నటరాజన్ తెలిపారు.
సిబిఐ నమోదిత ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేయాలనే పిటిషన్‌లో ఎటువంటి ఔచిత్యత కనబడటం లేదని పేర్కొన్న న్యాయమూర్తి సిబిఐ సంబంధిత విషయంలో దర్యాప్తు జరిపి తమకు మూడు నెలల వ్యవధిలో నివేదిక అందించాలని ఆదేశించారు. ఇప్పటికే సిబిఐ చాలా వరకూ దర్యాప్తు పూర్తి చేసి ఉన్నందున ఈ దశలో తమ జోక్యం అవసరం లేదని భావిస్తున్నట్లు తెలిపారు.
- Advertisement -