Friday, December 20, 2024

కనుల పండువగా బతుకమ్మ వేడుకలు

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/ హైదరాబాద్ : అటవీశాఖ ప్రధాన కార్యాలయం అరణ్యభవన్, రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలిలో బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. పెద్ద ఎత్తున మహిళా ఉద్యోగులు వారి కుటుంబ సభ్యులతో కలిసి బతుకమ్మ వేడుకల్లో ఆడి పాడారు. గురువారం అటవీశాఖ కార్యాలయంలో అటవీ సంరక్షణ ప్రధాన అధికారి ఆర్.ఎం. డోబ్రియాల్ దంపతులు, ఇతర ఉన్నతాధికారులు వారి కుటుంబ సభ్యులతో సహా బతుకమ్మ వేడుకలకు హాజరయ్యారు. ఉన్నతాధికారులు సువర్ణ, సునీతా భగవత్, రామలింగం, సైదులుతో పాటు ఐఎఫ్‌ఎస్ అధికారుల సతీమణులు వినీతా డోబ్రియాల్, సంగీతా, కిరణ్, రంజితా రెడ్డి, శర్మ పాండే, పికె ఝా, మలాసి తదితరులు వేడుకల్లో
పాల్గొన్నారు.

పిసిబి కార్యాలయంలో… : దేవీ నవరాత్రుల పురస్కరించుకొని ఏర్పాటు చేసిన మండపంలో అమ్మవారికి పిసిబి సభ్యకార్యదర్శి కృష్ణ ఆదిత్య పూజలు నిర్వమించారు. రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ప్రాంగణంలో బతుకమ్మ సంబురాలు ఘనంగా జరిగాయి. వివిధ రంగుల పూలతో పేర్చిన బతుకమ్మ చుట్టూ ఉద్యోగిణిలు ‘రామ రామ ఉయ్యలో రామోలోరి సీత ఉయ్యలో..’ అంటూ వుత్సహంగా ఉత్సాహంగా బతుకమ్మ ఆడి పాడారు. రంగు రంగు పూలతో బతుకమ్మను పేర్చి గౌరమ్మకు పూజలు చేసి ఆట పాటలతో సంబురాలు చేసుకున్నారు. అనంతరం బతుకమ్మలను నీటిలో నిమజ్జనం చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News