Sunday, December 22, 2024

అక్టోబర్ 31 నాటికి అన్ని కేరళ బస్సుల్లో సీసీటీవీ కెమెరాలు

- Advertisement -
- Advertisement -

తిరువనంతపురం : అక్టోబర్ 31 నాటికి అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ బస్సుల్లో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయాలని కేరళ ప్రభుత్వం ఆదేశించింది. ఈ నేపథ్యంలో ప్రతిబస్సు ముందు, వెనుక భాగంలో కెమెరాలను అమర్చుతున్నట్టు ఆ రాష్ట్ర రవాణా మంత్రి ఆంటోనీ రాజు తెలిపారు. బస్సు లోపల , వెలుపల ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలను సులువుగా గుర్తించడానికి కెమెరాలు ఉపయోగకరంగా ఉంటాయని ఆయన చెప్పారు. కేరళలో రహదారి భద్రతా ప్రమాణాలను పెంపొందించడానికి ప్రభుత్వం మరో నిర్ణయం కూడా తీసుకుంది. నవంబర్ 1 నుంచి ఆ రాష్ట్రంలో ప్రయాణించే భారీ వాహనాల్లో డ్రైవర్లు, ముందు కూర్చున్న ప్రయాణికులు తప్పనిసరిగా సీటు బెల్టు ధరించాలి. ఈ నిబంధన బస్సులకు కూడా వర్తిస్తుందని మంత్రి ఆంటోనీ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News