Monday, December 23, 2024

అధికారమిస్తే కులగణన

- Advertisement -
- Advertisement -

పెద్దపల్లి బహిరంగ సభలో రాహుల్ గాంధీ

మనతెలంగాణ/హైదరాబాద్/పెద్దపల్లిప్రతినిధి/కాటారం/మంథని: తెలంగాణాలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే కులగణన చేపడుతామని ఎఐసిసి అగ్రనేత, ఎంపి రాహుల్ గాంధీ అన్నారు. గురువారం జయశంకర్ జయశంకర్ భూపాలపల్లి, పెద్దపల్లి, కరీంనగర్ జిల్లా లో జరిగిన రెండోరోజూ బస్సుయాత్రలో భాగం గా ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా రాహుల్ మాట్లాడుతూ దేశంలో కులాల వారీగా గ ణాంకాలు చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుందని, అయినా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆయన మండిపడ్డారు.

ప్రధాని మోడీ కోటరీలో 5శాతం మంది కూడా ఓబిసి అధికారులు లేరని రాహుల్ ఆరోపించా రు. దేశంలో కాంగ్రె స్ పార్టీ అధికారంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో కూడా కులగణన కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఇదే పద్ధతిలో తెలంగాణా లో కూడా అధికారంలోకి రాగానే దీనినే అవలంభిస్తామని రాహుల్ గాంధీ ప్రకటించారు. దేశంలో ప్రజాస్వామ్య పాలన కొనసాగడం లేదని బ్యూరోకాట్ల కనుసన్నల్లోనే పాలన కొనసాగుతోందని ఆయన దుయ్యబట్టారు. 92 మం ది బ్యూరోక్రాట్లలో ఐదు శాతం మంది మా త్రమే ఓబిసిఅధికారులు ఉండడం దారుణమన్నారు. దేశంలో బిజెపిపై తానొక్కడినే ఒంటరి పోరాటం చేస్తున్నాని, తనపై కేసులు నమోదు చేశారని పార్లమెంటు సభ్యత్వం రద్దుచేసి ఇల్లు కూడా లేకుండా చేశారని రాహుల్ గాంధీ ఆవేదన వ్యక్తం చేశారు. అయినప్పటికీ తాను భయపడేది లేదని, నిస్సంకోచంగా పోరాటం చేస్తానని రాహుల్ గాం ధీ స్పష్టం చేశారు.

కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే సమ్మక్క-సారక్క జాతరకు జాతీయ పం డుగగా గుర్తింపు తెస్తామన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ హవా కొనసాగుతోందని కచ్చితంగా ఇక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామంటూ రాహుల్ పేర్కొన్నారు. బస్సు యాత్రలో భాగంగా వివిధ వర్గాల ప్రజలతో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సమావేశమవుతున్నారు. అందులో భాగంగా గురువారం సింగరేణి కార్మికులతో రాహుల్ సమావేశమయ్యారు. రాహుల్‌ను కలిసిన సింగరేణి కార్మికులు తమ స మస్యలను విన్నపించుకున్నారు. కార్మికుల సమస్యలను విన్న రాహుల్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత సింగరేణిని అభివృద్ధి చేస్తామని వా రికి హామీ ఇచ్చారు. కార్మికుల పక్షాన నిలబడతామని ఆయన తెలిపారు. సింగరేణి కార్మికులు ఎ లాంటి ఆందోళన పడాల్సిన అవసరం లేదని, కాం గ్రెస్ అండగా ఉంటుందని ఆయన హామీ ఇచ్చా రు. రాహుల్ టూర్ లో స్వల్ప మార్పులు జరిగాయి.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News