- Advertisement -
ఢిల్లీ: సుప్రీంకోర్టులో బిఆర్‌ఎస్‌కు ఎదురుదెబ్బ తగిలింది. కారును పోలిన గుర్తులను ఈ ఎన్నికల్లో ఇతరులకు కేటాయించొద్దని బిఆర్‌ఎస్ పిటిషన్ వేసింది. బిఆర్‌ఎస్ పిటిషన్‌ను సుప్రీం కోర్టు డిస్మిస్ చేసింది. కారు, రోటి మేకర్‌కు తేడా తెలుసుకోలేనంత అమాయకులు ఓటర్లు కాదని, ఓటర్లకు అన్నీ తెలుసునని కోర్టు వ్యాఖ్యానించింది. గత ఎన్నికలలో కొన్ని నియోజకవర్గాలలో కారుకు బదులుగా రోటికి ఓటర్లు ఓటు వేసినట్టు బిఆర్‌ఎస్ నాయకులు గుర్తించడంతో పాటు స్వల్ప ఓట్లతో బిఆర్‌ఎస్ ఓడిపోయిందని ఆరోపణలు చేసిన విషయం విధితమే.
- Advertisement -