టొరంటో : భారతదేశంలోని కెనెడియన్లు అత్యంత జాగరూకతతో ఉండాలని కెనడా ప్రభుత్వం శుక్రవారం ట్రావెల్ గైడ్‌లైన్స్ వెలువరించింది. ప్రత్యేకించి బెంగళూరు. ముంబై, చండీగఢ్‌ల్లోని కెనెడియన్లు అవసరం అయితే తప్ప ఎక్కువగా బయటకు రావద్దని హెచ్చరించారు. భారతదేశం నుంచి 41 మంది తమ దేశ దౌత్యవేత్తలను వెనకకు రప్పించే నిర్ణయం తరువాత కెనడా నుంచి ఈ ట్రావెల్ అడ్వయిజరీ వెలువడింది. ఇండియాలో కొందరిని ఎంచుకుని దాడుల ముప్పు ఉందని తమకు సమాచారం ఉన్నందున అప్రమత్తత అవసరం అని కెనడా అధికారిక ప్రకటనలో తెలిపారు. భారతదేశంలో ఇప్పుడు కెనడా పట్ల ప్రతికూల భావన ఉందని,
పలు చోట్ల కెనడియన్ల పట్ల నిరసనలకు పిలుపులు వెలువడుతున్నాయని, ఈ దశలో ప్రదర్శనల సమయంలో కెనెడియన్లు కన్పిస్తే పరిస్థితి వేరే విధంగా ఉంటుందని, దీనిని గుర్తుంచుకోవల్సి ఉందని , వేధింపులకు దాడులకు గురి అయ్యే వీలుందని హెచ్చరించారు. ఢిల్లీ, దేశ రాజధాని ప్రాంతంలో పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని వ్యవహరించాల్సి ఉంటుందని తెలిపారు. ఆయా ప్రాంతాలలో ఇప్పటికే కెనడా వీసా జారీ, కాన్సులర్ సేవల ప్రక్రియను నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. భారతదేశంలో పర్యటించేటప్పుడు ఎవరితో ఎక్కువగా మాట్లాడవద్దని, జాతీయతను చాటుకోవద్దని, లేకపోతే చోరీలకు గురి కావల్సి వస్తుంది. ఇతరత్రా ఇక్కట్లు ఎదురవుతాయని తెలిపారు.