Monday, December 23, 2024

గంజాయి విక్రయిస్తున్న ముగ్గురి అరెస్టు

- Advertisement -
- Advertisement -

సిటిబ్యూరోః గంజాయి విక్రయిస్తున్న ముగ్గురు నిందితులను తెలంగాణ స్టేట్ యాంటీ నార్కోటిక్ బ్యూరో(టిఎస్ నాబ్) పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి 23.405 కిలోల గంజాయి, రూ.40.3లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిందితుడి రూ.5.2కోట్ల ఆస్తులను సీజ్ చేశారు. పోలీసుల కథనం ప్రకారం…శేరిలింగంపల్లి, నానక్‌రాంగూడకు చెందిన కాలాపతి గౌతం సింగ్, నితూ బాయ్, మధుబాయ్, చాపల్‌కు నేహాబాయి కలిసి గంజాయి విక్రయిస్తున్నారు.

ముగ్గురు నిందితులను అరెస్టు చేయగా, చాపల్ నేహాబాయి పరారీలో ఉంది. నితూబాయ్‌కు చెందిన గాంధీనగర్, లంగర్‌హౌస్, గచ్చిబౌలిలోని మూడు ఇళ్లను సీజ్ చేశారు. వీటిని గంజాయి విక్రయించి కోనుగోలు చేసినట్లు పోలీసులు తెలుసుకున్నారు. రెండు వాహనాలు, ఏడు బ్యాంక్ ఖాతాలను గుర్తించారు, బ్యాంక్ ఖాతాలోని రూ.78.62లక్షల నగదు ఫ్రీజ్ చేశారు. భవనాల విలువ రూ.4కోట్లు ఉంటుందని పోలీసులు పేర్కొన్నారు. డిసిపి గుమ్మి చక్రవర్తి, డిఎస్‌పిలు సివాన్‌నాయుడు, శ్రీధర్, ఇన్స్‌స్పెక్టర్లు రమేష్ రెడ్డి, వెంకటేశ్వర్లు, ఎన్.వెంకటేశ్వర్లు పట్టుకున్నారు. కేసు దర్యాప్తు కోసం గోల్కొండ పోలీసులకు అప్పగించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News