Friday, December 20, 2024

World Cup 2023: లంకపై బ్యాటింగ్ ఎంచుకున్న నెదర్లాండ్స్

- Advertisement -
- Advertisement -

లక్నో: ప్రపంచకప్‌లో భాగంగా శనివారం శ్రీలంక-నెదర్లాండ్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన నెదర్లాండ్స్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. దక్షిణాఫ్రికా వంటి బలమైన జట్టుపై గత మ్యాచ్‌లో చారిత్రక విజయాన్ని అందుకున్న నెదర్లాండ్స్.. ఈ మ్యాచ్‌లో కూడా అదే జోరును కొనసాగించి లంకపై గెలుపొందాలని పట్టుదలతో ఉంది. ఇక, ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచుల్లోనూ ఓటమిపాలైన లంక.. నెదర్లాండ్స్ పై విజయం సాధించి మెగా టోర్నీలో బోణీ కొట్టాలని తహతహలాడుతోంది.

జట్ల వివరాలు

శ్రీలంక: పాతుమ్ నిస్సాంక, కుసల్ పెరీరా, కుసల్ మెండిస్, సదీర సమరవిక్రమ, చరిత్ అసలంక, ధనంజయ డి సిల్వా, దునిత్ వెల్లలాగే, చమిక కరుణరత్నే, మహేశ్ తీక్షణ, కసున్ రజిత, దిల్షన్ మదుశంక.

నెదర్లాండ్స్: విక్రమ్‌జిత్ సింగ్, మాక్స్ ఓ’డౌడ్, కోలిన్ అకెర్‌మాన్, బాస్ డి లీడే, సైబ్రాండ్ ఎంగెల్‌బ్రెచ్ట్, తేజా నిడమనూరు, స్కాట్ ఎడ్వర్డ్స్, లోగాన్ వాన్ బీక్, రోలోఫ్ వాన్ డెర్ మెర్వే, ఆర్యన్ దత్, పాల్ వాన్ మీకెరెన్.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News