Tuesday, October 22, 2024

ధాన్యం కొనుగోళ్లకు ఇసి బ్రేక్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/ హైదరాబాద్: రైతుల నుంచి ప్రభుత్వం సేకరించిన ధాన్యాన్ని బహిరంగ వేలం ద్వారా విక్రయించే ప్రక్రియకు ఎన్నికల సంఘం బ్రేకులు వేసింది. ఎన్నికల నిబంధన నియమావళి ప్రకారం ధాన్యం టెండర్లకు కూడా కోడ్ వర్తింస్తుందని ప్రకటించింది. ఎన్నికల కోడ్ అందుకు సంబంధించిన ప్రవర్తనా నియమావళి అటుంచితే , ధాన్యం టెండర్లు నిలిచిపోవటం ద్వారా రైస్‌మిల్లుల్లో పేరుకుపోయిన లక్షల టన్నుల ధాన్యం నిల్వలతో ప్రభుత్వానికి భారీగా నష్టం కలిగే అవకాశాలు ఉన్నట్టు చెబుతున్నారు. 2022-23 యాసంగి సీజన్‌కు సంబంధించి రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం పౌర ల శాఖ ద్వారా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధరకు కొనుగోలు చేసింది. తీరా మిల్లర్లు సిఎంఆర్ కింద ధాన్యాన్ని అందజేయటంలో మొండికేయటంతో లక్షల కొద్ది టన్నుల ధాన్యం నిల్వలు పేరుకుపోయాయి. ఈ ధాన్యం నిల్వలను ఏదో విధంగా విక్రయించి ఆర్థిక భారాన్ని తగ్గించుకోవాలన్న అభిప్రాయంతో ప్రభుత్వం ధా న్యం నిల్వలను బహిరంగ వేలం ద్వారా విక్రయించాలని నిర్ణయించింది. అందులో భాగంగానే తొలివిడతగా 25 లక్షల మెట్రిక్ టన్ను ల ధాన్యాన్ని విక్రయించేందుకు టెండర్లు పిలిచింది.

ఈ ప్రక్రియ ఇంకా కొనసాగుతుండగానే కేంద్ర ఎన్నికల కమిషన్ తెలంగాణ రా ష్ట్ర అసెంబ్లీకి ఎన్నికల షెడ్యూల్ ప్రకటించింది. ధాన్యం టెండర్లు కూ డా నిర్వహించరాదని ,ఎన్నికల కోడ్ మేరకు టెండర్ల ప్రక్రియను నిలిపివేయాలని ఎన్నికల సంఘం ఆంక్షలు విధించింది. ఎన్నికల సం ఘం తీసుకున్న ఈ చర్యల వల్ల ధాన్యం నిల్వలు అసెంబ్లీ ఎన్నికలు పూర్తయ్యేదాక ఎక్కడికక్కడే నిలిచిపోయే పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే ధాన్యం నిల్వలు ఎండకు ఎండి వానకు తడిసి ధాన్యం నా ణ్యత దెబ్బతింటుందన్న ఆందోళనతో ఉండగా, ఎన్నికల సంఘం ఆంక్షల కారణంగా మరో రెండు నెలల వరకూ కోడ్ అమలు వల్ల ధాన్యం నిల్వ లు అలాగే ఉంటే నాణ్యతపై మరింత ప్రభావం పడే ప్రమాదం ఉం దంటున్నారు. ఎన్నికల సంఘం విధించిన కోడ్ కారణంగా ధాన్యం విక్రయ టెండర్లు నిలిచిపోవడం వల్ల ప్రభుత్వం ధా న్యం విక్రయాల ద్వారా అంచాన వేసిన నిధులు వచ్చే అవకాశాలు లేకుండా పోయా యి. ఆ ప్రభావం ఇప్పురు రైతుల నుంచి సేకరించాల్సిన ఖరీఫ్ ధాన్యం పడే అవకాశాలు ఉంటాయంటున్నారు. రాష్ట్రంలో ఖరీఫ్ సీజన్ కింద రాష్ట్రంలో 65లక్షల ఎకరాల విస్తీర్ణంలో వరి సాగులోకి వచ్చింది. ఇప్పుడిప్పుడే వరిపంట కోతలు కూడా ప్రారంభమవుతున్నాయి.

దసరా తర్వాత ప్రభుత్వం రైతుల నుంచి ధాన్యం కొనుగోళ్లకు కూడా జిల్లాల వారీగా ఏర్పాట్లు చేస్తోం ది. ఒక పక్క ఎన్నికల విధులు నిర్వహిస్తూనే మరో వైపు ధాన్యం సేకరణకు కలెక్టర్ల నేతృత్వంలో చకచకా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రభుత్వం కూడా రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసి వెంటవెంటనే నిధులు రైతుల బ్యాం కు ఖాతాలకు జమ చేసేందుకు చర్యలు చేపట్టింది. ప్రభుత్వం ఆర్ధికశాఖ ద్వారా సుమారు రూ.25వేలకోట్ల మేరకు నిధులు సమకూర్చాల్సివుం ది. గత ఏడాది యాసంగిలో పేరుకు పోయిన ధాన్యం నిల్వలు టెండర్ల ద్వారా విక్రయిస్తే తద్వారా వచ్చే నిధులతో ఈ ఖరీఫ్‌లో రైతుల నుంచి ధా న్యం కొనుగోలుకు కొంతమేరకు నిధులు సర్దుబాటు అయివుండేవని అధికారులు చెబుతున్నారు. రైతులు తాము విక్రయించిన ధాన్యానికి ప్రభుత్వం నుంచి సకాలంలో నిధులు బ్యాంకు ఖాతాలకు జమ చేయగలిగితేనే రైతులు తిరిగి రబీ సీజన్ పంటలకు పెట్టుబడి పెట్టుకునే అవకాశాలు ఉంటాయి. అంతే కాకుండా బ్యాంకుల్లో తీసుకున్న పంట రుణాలు కూడా డిఫాల్ట్ కాకుండా సకాలంలో చెల్లించే అవకాశాలు ఉంటాయి. ధాన్యం విక్రయాల ద్వారా వచ్చే నిధుల్లో కొంత మొత్తం రైతుల కుటుంబ అవసరాలకు కూడా ఉపయోగించుకునే అవకాశం ఉంది. ఈ పరిస్థితుల్లో ఎన్నిలక కోడ్ వల్ల ధాన్యం విక్రయాల టెండర్ల ప్రక్రియ ఆగిపోతే ఆ ప్రభావం అంతిమంగా రైతులపైనే పడే అవకాశం ఉందని చెబుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News