Saturday, November 16, 2024

శనివారం రాశిఫలాలు (21-10-23)

- Advertisement -
- Advertisement -

మేషం :- ముఖ్యమైన కార్యక్రమాలలో ఏర్పడిన అవరోధాలు తొలుగుతాయి. ఆరోగ్య సమన్యలు ఎదురైనఅధిగమిస్తారు. ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి. కుటుంబ సభ్యుల నుండి సహాయ సహాకారాలు అందుతాయి.

వృషభం :- సంఘంలో గౌరవం పొందుతారు. నంతానం చేయు నూతన ప్రయత్నాలు అనుకులంగా ఉంటాయి. సేవకార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. ఆకస్మిక ధన, వస్తు లాభాలు పొందుతారు. వాహన, భూ యోగాలు గోచరిస్తున్నాయి.

మిథునం :- కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన వుంటుంది. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. విలువైన వస్తు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వివాహ, ఉద్యోగ యత్నాలు కలిసివస్తాయి. వాహనసౌఖ్యం.

కర్కాటకం :- బంధువులతో ఏర్పడిన మాటపట్టింపులు తొలగుతాయి. ఋణాలు తీరి ఊరట చెందుతారు.ప్రయాణాలలో తొందరపాటు తనం వద్దు. అనుకోని అవకాశాలు లభిస్తాయి. వాటిని సద్వినియోగం చేసుకోండి.

సింహం :- భాగస్వామ్య వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు. ఇతరులవిషయాలలో జోక్యం వద్దు. ఆర్థికపరిస్థితి అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగులకు స్థానమార్పులుకలుగుతాయి. కాంట్రాక్టులు దక్కుతాయి.

కన్య:- సోదరుల నుండి కీలక సమాచారం అందుతుంది. రాజకీయ, కళా రంగాల వారికి సన్మానాలు, సత్కారాలుపొందుతారు. బంధువుల నుండి ధన, వస్తు లాభాలు పొందుతారు. వృత్తి-వ్యాపారాలు లాభిస్తాయి. శుభవార్తలు వింటారు.

తుల:- వ్యత్తి-వ్యాపారాలలో ప్రోత్సాహం లభిస్తుంది. చేపట్టిన పనులు అతికష్టం మీద సకాలంలో పూర్తి చేస్తారు. విందు వినోదాలు,చురుకుగా పాల్గొంటారు. పెట్టుబడులకి తగిన లాభాలు ఆర్జిస్తారు. నూతన  వస్తు సేకరణకు శ్రీకారం చుడతారు.

వృశ్చికం :- వివాదాలకు, కోపతాపాలకు దూరంగా ఉండండి. బంధువులను కలిసి ఆనందంగా గడుపుతారు.పనులలో ఎదురైన ఆటంకాలు తొలుగుతాయి. మానసిక ప్రశాంతత పొందుతారు. ఆర్ధిక లాభం కలుగుతుంది.

ధనుస్సు:- ఉద్యోగాలలో స్థాన చలనం గోచరిస్తున్నది. వృత్తి-వ్యాపారాలలో ఎదురైన ఆటుపోటులను అధిగమిస్తారు. ఆర్థికపరిస్థితి అంతంత మాత్రంగా వుంటుంది. జీవిత భాగస్వామి నుండి ధన, వస్తు లాభాలు పొందుతారు. శుభవార్తలు మీకు మానసిక ఆనందం కలిగిస్తాయి.

మకరం:- నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. గృహ నిర్మాణ ఆలోచనలు ఫలిస్తాయి. పాతమిత్రులనుకలిసి ఆనందంగా గడుపుతారు. అనుకోని ఆహ్వానాలు ఆశ్చర్యపరుస్తాయి. భూయోగాలు పొందుతారు. అర్దికస్తితి మెరుగుపడుతుంది.

కుంభం :- ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి. మిత్రులతో ఏర్పడిన వివాదాలు పరిష్కారమై ప్రశాంతత పొందుతారు.భూవివాదాలు తీరి నూతన ఒప్పందాలు కుదురుతాయి. ఆర్థిక పరిస్థితి కొంత అనుకూలంగా ఉంటుంది. ఆప్తులతో ఆనందంగా గడుపుతారు.

మీనం :- ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు. మిత్రుల నుండి కీలక నమాచారంఅందుకొంటారు. విందు, వినోదాలు, శుభకార్యాలలో  చురుకుగా పాల్గొంటారు. సన్నిహితులతొ చర్చాగోష్టి జరుపుతారు. ఆరోగ్య విషయంలో కొంత మెలకువ అవసరం.

 

 

 

 

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News