Sunday, December 22, 2024

బిజెపి, కాంగ్రెస్ నాయకులపై మంత్రి సత్యవతి రాథోడ్ సంచలన వ్యాఖ్యలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఈ నెల 27న మహబూబాబాద్ లో ముఖ్యమంత్రి కెసిఆర్ బహిరంగ సభ నేపథ్యంలో సభస్థలి, హెలిప్యాడ్ ఏర్పాట్లను మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు,సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యే శంకర్ నాయక్, జెడ్పీ చైర్ పర్సన్ కుమారి అంగోత్ బిందు పరిశీలించారు. అనంతరం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ…. రాష్ట్ర ప్రజలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు. 27 న మహబూబాబాద్ లో జరిగే సీఎం కెసిఆర్ బహిరంగ సభను విజవంతం చేయాలని పిలుపునిచ్చారు. 70 వేల మందితో బారి బహిరంగ సభ నిర్వహిస్తామన్నారు.

మహబూబాబాద్ జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన గొప్ప నాయకుడు సీఎం కెసిఆర్ అని ఆమె వెల్లడించారు. సీఎం కెసిఆర్ నీ ముడోసారి ముఖ్యమంత్రిగా చూడాలని ప్రజలు పట్టుదలతో ఉన్నారన్నారు. కాంగ్రెస్, బిజెపి పార్టీలకు ఇంకా అభ్యర్థులు దొరకడం లేదని ఎద్దేవా చేశారు. బిజెపి, కాంగ్రెస్ పార్టీలు అభ్యర్థులను ప్రకటించాలన్న ఢిల్లీ నాయకులే డిసైడ్ చేయాల్సిన దౌర్భాగ్య స్థితిలో ఉన్నారని పేర్కొన్నారు. బిజెపి , కాంగ్రెస్ నాయకులకు మానుకోట రాళ్లకున్న పౌరుషం కూడా లేదని మంత్రి సత్యవతి రాథోడ్  తెలిపారు. ప్రజల కష్టసుఖాలు తెలిసిన బిఆర్ఎస్ పార్టీకే ప్రజలు పట్టం కడతారని ఆమె దీమా వ్యక్తం చేశారు. మహబూబాబాద్ బిఆర్ఎస్ అభ్యర్థి శంకర్ నాయక్ ను మరోసారి ప్రజలు ఆశీర్వదించాలని మంత్రి పిలుపునిచ్చారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News