Monday, December 23, 2024

కెసిఆర్ ఇప్పుడు మాట్లాడరెందుకు: భట్టి విక్రమార్క

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టు అద్భుతం అని ముఖ్యమంత్రి కెసిఆర్, కెటిఆర్ పదేపదే అన్నారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పేర్కొన్నారు. గతేడాది వరదల్లో పంపుహౌసులు మునిగి భారీగా నష్టం జరిగిందన్నారు. రూ. 30 వేల కోట్లతో పూర్తయ్యే ప్రాజెక్టుకు రూ. లక్షల కోట్లు ఖర్చు చేశారని భట్టి ఆరోపించారు. కెసిఆర్ చేసిన రీడిజైనింగ్ వల్లే కాళేశ్వరం నష్టదాయకంగా మారిందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు రాష్ట్రానికి గుదిబండగా మారిందని భట్టి విక్రమార్క తెలిపారు. డిజైన్లు తనే రూపొందించానన్న కెసిఆర్ ఇప్పుడు మాట్లాడరెందుకు అని భట్టి ప్రశ్నించారు. తెలంగాణ ప్రజల సోమ్ము కెసిఆర్ గోదావరిలో పోశారని ఆయన మండిపడ్డారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News