Friday, December 20, 2024

సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన మంత్రి కెటిఆర్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ పూల పండుగ బతుకమ్మ ముగింపు చివరి రోజు ‘సద్దుల బతుకమ్మ’ను పురస్కరించుకొని బిఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కెటిఆర్ ట్విట్టర్ వేదికగా ఆడబిడ్డలందరికి శుభాకాంక్షలు తెలిపారు. పుడమి పులకరించే..సింగిడి రంగుల పూల వైభవం, ప్రకృతి పరవశించే తీరొక్క వర్ణాల బతుకు సంబురం, పువ్వులు..నవ్వులు విరబూసే సహజీవన సౌందర్యం, ఇచ్చిపుచ్చుకునే వాయినాల ..అచ్చమైన ఆనంద పరిమళం, నిండిన చెరువుల నీటి అలలపై ఉయ్యాలలూగే గౌరమ్మలు, పండిన పచ్చని పంట చేనుల దారుల్లో పూల తేరులు,
సమిష్టి సంస్కృతిని చాటిచెప్పే విశిష్ట వేడుక, స్త్రీల సృజనతో వెలిగే తెలంగాణ అస్తిత్వ ప్రతీక, ఆడబిడ్డలందరికి సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలంటూ మంత్రి కెటిఆర్ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్‌గా మారింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News