Monday, December 23, 2024

కొత్త ఓటర్ల దగ్గరికి చొచ్చుకెళ్లండి

- Advertisement -
- Advertisement -

కాంగ్రెస్ దుష్ప్రాచారాన్ని తిప్పికొట్టండి

మన తెలంగాణ/హైదరాబాద్ : బిఆర్‌ఎస్ మేనిఫెస్టో, తొమ్మిదేళ్ల పాలన ఫలాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కెటిఆర్ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. క్షే త్రస్థాయిలో ప్రజలు బిఆర్‌ఎస్‌తోనే ఉన్నారని స్ప ష్టం చేశారు. మూస పద్ధతులతో కాకుండా.. కొత్త తరహాలో ప్రజలకు చేరువ కావాలని చెప్పారు. సోషల్ మీడియా ద్వారా కొత్త ఓటర్లకు చేరువ కావాలని పిలుపునిచ్చారు. మేనిఫెస్టోను మరింత విస్తృతంగా ప్రజల్లోకి  తీసుకెళ్లాలని, కాంగ్రెస్ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని సూ చించారు.సోషల్ మీడియా ప్రభావం తెలియని నేతలు సై తం ఇంకా ఉన్నారని.. సోషల్ మీడియాతోనే మోడీ జాతీయస్థాయి నాయకుడిగా ఎదిగారని చెప్పారు. సీనియర్ నా యకులు ఇంకా కొత్త రకం ఎన్నికల విధానానికి అలవాటు పడలేదని, దానిని వినియోగించుకోవాలని సూచించారు. జలవిహార్‌లో ఆదివారం బిఆర్‌ఎస్ ఇంఛార్జ్‌లు, వార్‌రూం సభ్యులతో ఆదివారం మంత్రులు కెటిఆర్, హరీశ్‌రావులు సమావేశం నిర్వహించారు. అసెంబ్లీ ఎన్నికలలో అనుసంచాల్సిన వ్యూహాలపై మంత్రులు కెటిఆర్, హరీశ్‌రావులు పా ర్టీ శ్రేణులకు దిశానిర్ధేశం చేశారు. ఈ సందర్భంగా కెటిఆర్ మాట్లాడుతూ, కాంగ్రెస్ తీరుపై ధ్వజమెత్తారు. గ్రామ స్థా యిలో ప్రజలు తమతోనే ఉన్నారని, గతం కన్నా మెరుగైన ఫలితాలతో ఘన విజయం సాదిస్తామని ధీమా వ్యక్తం చేశారు. కెసిఆర్ ముచ్చటగా మూడోసారి ముఖ్యమంత్రి కావడం ఖాయమని సర్వే రిపోర్టులు కూడా స్పష్టం చేస్తున్నాయని తెలిపారు. ఈసారి బిఆర్‌ఎస్ పార్టీ గత ఎన్నికల కంటే ఎక్కువ స్థానాలలో విజయం సాధిస్తుందని చెప్పారు.
ఎన్నికల వ్యూహాలపై కేడర్‌తో చర్చ
కేంద్ర ఎన్నికల కార్యాలయంతో ఎలా పనిచేయాలి, ఎన్నికల ప్రచారంలో ప్రతి రోజు ఏ విధంగా ముందుకు పోవాలనే విషయాలపై కెటిఆర్ చర్చించారు. ఎలాంటి వ్యూహాలు అమలు చేస్తే మంచి ఫలితాలు వస్తాయి.. తదితర విషయాల గురించి మాట్లాడారు. ప్రజల్లో బిఆర్‌ఎస్‌పై నమ్మ కం ఉందని.. 119 నియోజకవర్గాల ఇంఛార్జ్‌లు, వార్ రూ మ్ ప్రతినిధులు తెలిపారు. గత రెండు రోజుల్లో ముడు స ర్వే రిపోర్ట్లు బయటకి వచ్చాయని.. వాటన్నింటిలో బిఆర్‌ఎస్‌కు 70కి పైగా స్థానాలు వస్తాయని గుర్తు చేశారు. కెసిఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని సర్వే ఏజెన్సీలు కూడా చెబుతున్నాయి. సానుకూలంగా ఉన్న ప్రజలను బిఆర్‌ఎస్ ఓటుగా ఎలా మలచాలి.. ఎలాంటి పద్దతులు అవలింభించాలనే అంశాలపై చర్చించారు.
కిషన్ రెడ్డి పారిపోయారు
బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ఎన్నికల రణరంగంలో వె న్నుచూపి పారిపోయారని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కెటిఆర్ విమర్శించారు. ఈ ఎన్నికల్లో బిజెపికి 100 స్థానాలలో, కాంగ్రెస్‌కు 40 స్థానాల్లో అభ్యర్థులు లేరని తెలిపారు. సంస్కారంగా మాట్లాడాలని అంటున్న జా నారెడ్డి ముందురేవంత్‌రెడ్డికి కాంగ్రెస్ నేత జానారెడ్డి సంస్కారం నేర్పాలని మంత్రి కెటిఆర్ అన్నారు. కెసిఆర్‌కు పిండం పెట్టాలనుప్పుడు ఆయన సంస్కారం ఎక్కడికి పోయిందని నిలదీశారు. సంస్కారం గురించి కాంగ్రెస్ నేతల దగ్గర నే ర్చుకోవాల్సిన ఖర్మ తమకు లేదని అన్నారు. రూ.50 కోట్లకు పిసిసి పదవి అమ్ముకున్న దగుల్బాజీ పార్టీ కాంగ్రెస్ అని దుయ్యబట్టారు.టికెట్ల కోసం రేవంతరెడ్డి డబ్బులు వసూలు చేస్తున్నాడని ఆ పార్టీ నేత లే ఇడికి ఫిర్యాదు చేస్తున్నారన్నారు.కాంగ్రెస్ నేతల వద్ద సంస్కారం నేర్చుకోవాల్నిస ఖర్మ తమకు లేదంటూ ధ్వజమెత్తారు.

Harish Rao

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News