Monday, December 23, 2024

‘స్పార్క్ లైఫ్’ థర్డ్ సింగిల్ ‘జ్ఞాపకాలు’ విడుదల

- Advertisement -
- Advertisement -

అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మితమవుతున్న ‘స్పార్క్ లైఫ్’ సినిమాతో విక్రాంత్ హీరోగా తెలుగు తెరకు పరిచయం కాబోతోన్నారు. ఈ సినిమాతో హీరోగా మాత్రమే కాకుండా.. కథా రచన, స్క్రీన్ ప్లేను కూడా అందిస్తున్నారు. ఈ మూవీలో మెహరీన్ పిర్జాడా, రుక్షర్ ధిల్లాన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. డెఫ్ ప్రాగ్ ప్రొడక్షన్స్ మీద ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

హృదయం, ఖుషి చిత్రాలతో అందరినీ ఆకట్టుకున్న హేషమ్ అబ్దుల్ వాహబ్ ఈ మూవీకి సంగీతాన్ని అందిస్తున్నారు. మలయాళీ నటుడు గురు సోమసుందరం ఈ మూవీలో విలన్‌గా నటిస్తున్నారు. రీసెంట్‌గానే ఈ మూవీ చిత్రీకరణ పూర్తయింది. ప్రేక్షకులకు ఓ కొత్త అనుభూతిని అందించేందుకు చిత్రం త్వరలోనే రాబోతోంది. మొత్తం ఐదు భాషల్లో సినిమా విడుదల కాబోతోంది.

నవంబర్ 17న ఈ సైకాలిజికల్ థ్రిల్లర్ మూవీ థియేటర్లోకి రాబోతోంది. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన రెండు పాటలు, ఫస్ట్ లుక్ పోస్టర్, ట్రైలర్ ఇలా అన్నీ కూడా సినిమా మీద అంచనాలు పెంచాయి. తాజాగా థర్డ్ సింగిల్ ‘జ్ఞాపకాలు’ అనే పాటను రిలీజ్ చేశారు. హేషమ్ బాణీ, అనంత శ్రీరామ్ సాహిత్యం, హేషమ్ కృష్ణ లాస్య ముత్యాల గాత్రం ఈ పాటను ఎంతో వినసొంపుగా మలిచాయి. హీరో హీరోయిన్ల మధ్య ప్రేమని చాటి చెప్పేలా ఈ పాట ఉంది. లీడ్ పెయిర్ కెమిస్ట్రీనే హైలెట్‌గా ఆ పాట సాగుతుంది. విజువల్స్ సరికొత్త అనుభూతిని ఇచ్చేలా ఉన్నాయి.

విక్రాంత్, మోహరీన్, రుక్షర్ ధిల్లాన్ ప్రధాన పాత్రలు పోషించగా.. నాజర్, సుహాసిని మణిరత్నం, వెన్నెల కిషోర్, సత్య, బ్రహ్మాజీ, శ్రీకాంత్ అయ్యంగార్, చమ్మక్ చంద్ర, అన్నపూర్ణమ్మ, రాజా రవీంద్ర వంటి వారు ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ఈ మూవీ తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో భారీ ఎత్తున విడుదల కానుంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News