Saturday, January 11, 2025

టైగర్‌3 ఫస్ట్ ట్రాక్‌  ‘లేకే ప్రభు కా నామ్‌’

- Advertisement -
- Advertisement -

మెగాస్టార్‌ సల్మాన్‌ఖాన్‌, కత్రినా కైఫ్‌ ఆన్‌స్క్రీన్‌ కెమిస్ట్రీ గురించి, ఇండియన్‌ సినిమా హిస్టరీలో ఈ జంటకున్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. డ్యాన్స్ నెంబర్స్ వీరిద్దరికీ కుదిరినంతగా మరెవ్వరికి కుదరవు అని అన్నా ఆశ్చర్యపోనక్కర్లేదు. అంతగా ఆన్‌స్క్రీన్‌ మీద దుమ్ముదులిపే అద్భుతమైన జంట మళ్లీ మన ముందుకు వచ్చేశారు. ఆదిత్య చోప్రా టైగర్‌3లో కలిసి నటించారు వీరిద్దరూ. ఐకానిక్‌ కేరక్టర్లు, సూపర్‌ ఏజెంట్లు టైగర్‌, జోయాగా వీరిద్దరు మళ్లీ జనాలను పలకరించడానికి మేం రెడీ అంటూ రంగంలోకి దిగేస్తున్నారు. యష్‌రాజ్‌ఫిలిమ్స్ స్పై యూనివర్శ్‌లో తామేంటో మరోసారి ప్రూవ్‌ చేస్తామంటున్నారు.

గత వారం రోజులుగా యష్‌ రాజ్‌ ఫిలిమ్స్ పార్టీ  నెంబర్‌ లేకే ప్రభు కా నామ్‌తో  జనాలకు గిలిగింతలు పెడుతోంది. ఈ పాట ఏ రేంజ్‌లో ఉంటుందోననే ఎక్స్ పెక్టేషన్స్ కూడా అదే స్థాయిలో ఉన్నాయి. టైగర్‌ జిందా హై లో స్వాగ్‌ సే స్వాగత్‌ను మించేలా ఉంటుందనే సమాచారం ఇప్పటికే జనాలను ఊరిస్తోంది.  అప్పట్లో ఆ పాట సాంగ్‌ ఆఫ్‌ ది ఇయర్‌ అయింది. దాన్ని మించేలా ఉంటుందని అంటేనే, దీని స్థాయి ఏంటో ఊహించుకోవచ్చు.

లేకే ప్రభు కా నామ్‌లో అదుర్స్ అనిపిస్తున్న సల్మాన్‌, కత్రినా!

సల్మాన్‌ ఖాన్‌, కత్రినా కైఫ్‌ కాంబినేషన్‌కీ, వారిద్దరి ఆన్‌స్క్రీన్‌ కెమిస్ట్రీకి సూపర్బ్ వైబ్‌ ఉంటుంది. చూసిన ప్రతి ఒక్కరూ ఫిదా అవ్వాల్సిందే. వారిద్దరి డ్యాన్సింగ్‌ స్కిల్స్ తో లేకే ప్రభు కా నామ్‌ పాటను తెరకెక్కించారు యష్‌ రాజ్‌ఫిలిమ్స్ మేకర్స్. ప్రీతమ్‌ కంపోజ్‌ చేసిన పాట ఇది. అమితాబ్‌ భట్టాచార్య సాహిత్యం అందించారు. ఈ పాటను అర్జిత్‌ సింగ్‌, నిఖితా గాంధీ కలిసి ఆలపించారు. తెలుగు, తమిళ్‌ వెర్షన్లను బెన్ని డయాల్‌, అనుషా మణి పాడారు. లేకే ప్రభు కా నామ్‌ పాటను లావిష్ గా తెరకెక్కించారు. చాలా గ్రాండ్‌ స్కేల్‌లో చిత్రీకరించిన విజువల్స్ మెప్పిస్తాయి. టర్కీలోని అత్యద్భుతమైన లొకేషన్లలో తెరకెక్కించిన తీరు ఆడియన్స్ ని ఫిదా చేస్తుంది. వైభవి మర్చంట్‌ కొరియోగ్రఫీ చేశారు ఆ పాటకు. గతంలో స్వాగ్‌ సే స్వాగత్‌ పాటకు కూడా వైభవి కొరియోగ్రఫీ చేశారు. సల్మాన్‌, కత్రినాతో మరోసారి స్టెప్పులేయించడం హ్యాపీగా ఉందన్నారు వైభవి.
మనీష్‌ శర్మ దర్శకత్వం వహించిన సినిమా టైగర్‌3. యష్‌రాజ్‌ ఫిలిమ్స్ స్పై యూనివర్శ్‌లో భాగంగా తెరకెక్కింది. ఈ దీపావళి కానుకగా నవంబర్‌ 12న విడుదలకు సిద్ధమవుతోంది టైగర్‌3.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News