Sunday, December 22, 2024

తమిళనాడులో కారు ప్రమాదం: ఏడుగురు మృతి

- Advertisement -
- Advertisement -

చెన్నై: తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటనలో ఏడుగురు మృతి చెందారు. తిరువణ్ణామలైలో కారు, బస్సు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. కృష్ణగిరి హైవేపై అర్ధరాత్రి ప్రమాదం జరిగినట్లు అధికారులు వెల్లడించారు. మృతుల్లో ఆరుగురు అస్సాం వాసులు. ఒకరు తమిళనాడుకు చెందినవారు. బాధితులు పాండిచ్చేరిలోని జిగురు ఫ్యాక్టరీ నుంచి హోసూర్‌కు వెళ్తున్నట్లు తెలుస్తోంది.

కార్మికులు ప్రయాణిస్తున్న టాటా సుమో కారు అదుపు తప్పి బెంగళూరు నుంచి వస్తున్న ప్యాసింజర్ బస్సును ఢీ కొట్టింది. తీవ్రంగా గాయపడిన ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదంలో 14 మంది గాయపడ్డారు. వారిని సమీపంలోని ఆసుపత్రుల్లో చేర్పించారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News