Monday, December 23, 2024

నిజం గెలవాలంటే సిబిఐ విచారణకు పిలుపునివ్వు భువనేశ్వరి: రోజా

- Advertisement -
- Advertisement -

అమరావతి: నారా భువనేశ్వరి నిజం గెలవాలని గట్టిగా పూజలుచేసినట్టుగా ఉందని మంత్రి రోజా ఎద్దేవా చేశారు. మంగళవారం మంత్రి రోజా మీడియాతో మాట్లాడారు. తాము కూడా నిజం గెలవాలని కోరుకుంటున్నామని, నిజం గెలిస్తే జీవిత కాలం చంద్రబాబు జైల్లో ఉంటారని విమర్శించారు. ఆయనతో పాటు లోకేష్, భువనేశ్వరి కూడా జైలుకు వెళ్లే అవకాశం ఉందని, నిజంగా భువనేశ్వరికి నిజం గెలవాలని ఉంటే సిబిఐ విచారణకు పిలుపునివ్వాలని రోజా ప్రశ్నించారు. యువగళం చేయలేక నారా లోకేష్ మంగళం పాడారని చురకలంటించారు. 2024లో జగనన్న వన్స్ మోర్ అని ప్రజలు ఫిక్స్ అయ్యారని ప్రశంసించారు.

Also Read: కాసేపట్లో మేడిగడ్డ బ్యారేజ్ ని పరిశీలించనున్న కేంద్ర బృందం

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News