మేషం:-మిత్రుల నుండి కీలక సమాచారం అందుకొంటారు.ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. వివాదాలకు దూరంగా ఉండండి. దీర్ధకాలిక సమస్యలు ఎదురై చికాకులు పెడతాయి.
వృషభం :-ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వాహనసౌఖ్యం. ఋణ వత్తిడులు ఎదురైనాఅంత ఇబ్బందికరంగా ఉండవు. దూరపు బంధువులతో ఏర్పడిన వివాదాలుపరిష్కరించుకొంటారు. సఖ్యత నెలకుంటుంది.
మిథునం :- ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. నూతన ప్రయత్నాలు అనుకూలిస్తాయి.భాగస్వామ్య వ్యాపారాలలోఅభివృద్ధి సాధిస్తారు. కుటుంబంలో స్వల్ప కలతలు ఉంటాయి. ఆహ్వానాలు అందుకుంటారు.
కర్కాటకం :- వృత్తి-వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ప్రయాణాలలో ఆటంకాలు ఎదురైన అధిగమిస్తారు.ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు. ధన వస్తు లాభాలు కలుగుతాయి.
సింహం :- పట్టుదలతో ముందుకు సాగి పనులు పూర్తి చేస్తారు. ఆప్తులతో ఆనందంగా గడుపుతారు. దూర ప్రాంతాల నుండి వచ్చిన ఆహ్వానాలుఆశ్చర్యపరుస్తాయి. విందు, వినోదాలు, శుభకార్యాలలో పాల్గొంటారు. క్రయవిక్రయాలలో ప్రోత్సాహం లభిస్తాయి.
కన్య :- బంధువులను కలిసి ఆనందంగా గడుపుతారు. వివాదాలకు, కోపతాపాలకు దూరంగా ఉండండి.ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వృత్తి-వ్యాపారాలలో ఎదురైన ఆటుపోట్లు తొలుగుతాయి. స్వల్ప ధన ప్రాప్తి.
తుల :- దూర ప్రాంతాల నుండి వచ్చిన ఆహ్వానాల వలన ఆనందం కలుగుతుంది. పెట్టుబడులకు తగినలాభాలు పొందుతారు. అనుకోని అతిథులను కలుస్తారు. కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా గడుపుతారు. సంఘంలో మీ మాటకు పరపతి పెరుగుతుంది.
వృశ్చికం :- మీ కృషి ఫలిస్తుంది. కొత్త మిత్రులు పరిచయమై నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు.ప్రముఖుల కలయిక లభిస్తుంది. ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. కాంట్రాక్టుల కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి.
ధనుస్సు :-ఆప్తులను కలిసి ఆనందంగా గడుపుతారు. సంతానం తలపెట్టిన నూతన కార్యక్రమ ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి.పనుల్లో ఆటంకాలు ఎదురైన ఓర్పుతొ అధిగమిస్తారు.భాగస్వామ్య వ్యాపారాలు లబ్ధి పొందుతాయి. ప్రయాణాలులాభిస్తాయి.
మకరం:- ఆర్థిక ఇబ్బందులు ఎదురైన అధిగమించి ముందుకు సాగుతారు. ఋణాలు కొంత వరకు తీరుస్తారు.అనుకోని సమస్యలు ఎదురైన సన్నిహితుల సాయంతో తీర్చకొంటారు. క్రయవిక్రయాలలో ప్రోత్సాహం లభిస్తుంది. సంతోషకరమైన వాతావరణం ఉంటుంది.
కుంభం :- నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. బంధువులను కలిసి ఆనందంగా గడుపుతారు. శుభకార్యాలలోచురుకుగా పాల్గొంటారు. దూర ప్రాంతాల నుండి విలువైన సమాచారం అందుకొంటారు. వివాహం కోసం చేసే ప్రయత్నాలుఅనుకూల దిశగా సాగుతాయి.
మీనం:-కుటుంబ సభ్యులతో విహారయాత్రలలో ఆనందంగా గడుపుతారు. ముఖ్యమైన వృవహారాలలో విజయం సాధిస్తారు. గృహ నిర్మాణ ఆలోచనలు కలిసి వస్తాయి. ఆర్థికలావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. విలువైన వస్తు, వస్త్రా ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వాహన సౌఖ్యం గోచరిస్తున్నది.