Friday, December 20, 2024

పలస్తీనియులపై ఇజ్రాయిల్ అఘాయిత్యాలు

- Advertisement -
- Advertisement -

ముస్లిం మేధావుల ఆగ్రహం… గాజాను వీడాలని డిమాండ్
ఎంఐఎం నేతృత్వంలో ముస్లిం మేధావుల సభ

మన తెలంగాణ / హైదరాబాద్ : పాలస్తీనియన్లపై ఇజ్రాయిల్ అఘాయిత్యాలకు పాల్పడుతోందని, ఆసుపత్రులు, ప్రార్థనా స్థలాలు, పాఠశాలలపై బాంబుదాడులతో విధ్వంసం సృష్టిస్తోందని ముస్లిం మేధావులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. గాజా ను అక్రమంగా ఆక్రమించుకొని ఒపెన్ జైలుగా మార్చిందని, అక్కడి ప్రజలకు మౌలిక వసతులు లేకుండా బందీలుగా తమ ఆక్రమణలో పెట్టుకుందని ఆరోపించారు. పాలస్తీనియన్లపై ఇజ్రాయిల్ అఘాయిత్యాలు, దాడులకు నిరసనగా, పాలస్తీయిన్లకు సంఘీభావం తెలుపుతూ మజ్లిస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసి నేతృత్వంలో పార్టీ కార్యాలయం దారుస్పలాంలో భారీ బహిరంగ సభ జరిగింది.

ఈ సభలో ఎంఐఎం నేతలతో పాటు బిఆర్‌ఎస్ నేత, హొమ్ మంత్రి మహమూద్ అలీ, ముస్లిం ఉలేమాలు, మత సంఘాల పెద్దలు, మేధావులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఇజ్రాయిల్ దౌష్టికాలను తీవ్రంగా ఖండించారు. ఇజ్రాయిల్ వెంటనే గాజా భూభాగాన్ని వీడాలని డిమాండ్ చేశారు. ఇజ్రాయిల్ బాంబు దాడుల వల్ల గాజా లోని అనేక పాఠశాలలు, మసీదులు, చర్చీలు, ఆసుపత్రులు ధ్వంసం అయ్యాయని వేలాది మంది పిల్లలు, మహిళలు మృత్యువాత పడ్డారని ఆరోపించారు. ఇజ్రాయిల్ దాడుల్లో ఇప్పటికి 5080 మంది మృత్యువాత పడితే వారిలో 2 వేల మంది పిల్లలు, 1119 మంది మహిళలు ఉన్నారని తెలిపారు. పాలస్తీనా భూభాగమైన గాజాలోని కొంత భాగాన్ని 1948లో, మరికొంత భాగాన్ని 1967లొ ఇజ్రాయిల్ ఆక్రమించిందని, 2006 నుండి గాజాను ఒపెన్ జైలుగా మార్చిందని, అక్కడి ప్రజలకు మౌలిక వసతులు కూడా లేకుండా అణిచివేత, అఘాయిత్యాలకు పాల్పడుతోందని ఆరోపించారు.

పాలస్తీనియన్ల భూమి నుండి వైదొలగాలని గతంలో మహాత్మా గాంధీ చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా పలువురు వక్తలు గుర్తు చేశారు. ఇజ్రాయిల్ ఆక్రమణల నుండి వెనక్కు పోవాలని డిమాండ్ చేశారు. నార్త్ పాలస్తీన నుండి ఇజ్రాయిల్ దళాలు వెనుదిరగాలని డిమాండ్ చేశారు. పాలస్తీనియన్లకు తెలంగాణ ప్రభుత్వం అండగా ఉందని ఈ సందర్బంగా మంత్రి మహమూద్ అలీ తెలిపారు. వారికి న్యాయం జరగాలని ప్రార్థించారు. పాలస్తీనియన్లకు పూర్తి సంఘీభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఇజ్రాయిల్ వ్యతిరేక నినాదాలతో దారుస్సలాం మిన్నంటింది. పాలస్తీన జిందాబాద్ నినాదాలు మారుమ్రోగాయి. పాలస్తీనియన్ల సంఘీభావ సభకు ముస్లింలతో పాటు హిందువులు కూడా అధిక సంఖ్యలో పాల్గొనడం, ఇజ్రాయిల్‌కు వ్యతిరేకంగా, పాలస్తీ,నియన్లకు సంఘీవం తెలుపడం విశేషం.

Palestine 2

Palestine 4

Palestine 3

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News