Monday, November 25, 2024

రెండు సరకుల నౌకలు ఢీకొని ముగ్గురి మృతి… మరికొందరు గల్లంతు

- Advertisement -
- Advertisement -

బెర్లిన్: జర్మనీ నార్త్ సీ తీరంలో రెండు సరకుల నౌకలు ఢీకొని ముగ్గురు మృతి చెందారని, మరికొందరు గల్లంతయ్యారని జర్మనీ ప్రభుత్వ వర్గాలు మంగళవారం వెల్లడించాయి. మృతుల్లో నావికుడు ఒకరు ఉన్నారు. ఈ ప్రమాదం జర్మనీకి సమీపాన హెల్గోలాండ్ ద్వీపానికి నైరుతిదిశగా 22 కిలోమీటర్ల దూరంలో మంగళవారం తెల్లవారు జామున 5 గంటల ప్రాంతంలో సంభవించిందని జర్మనీ మారిటైమ్ ఎమర్జెన్సీస్ సెంట్రల్ కమాండ్ తెలియజేసింది. ఈ రెండు నౌకల్లో ఒకటి బ్రిటన్‌కు చెందిన వెరైటీ పేరున్ను నౌక. అందులో ఏడుగురు ఉన్నారు. 91 మీటర్లు (299 అడుగులు) పొడవు, 14 మీటర్లు (46 అడుగులు) వెడల్పున్న ఈ నౌక దాదాపు మునిగిపోయినట్టే తెలుస్తోంది.

ఈ నౌక నుంచి ఇద్దరు నావికులను రక్షించ గలిగారు. మరొక నావికుని మృతదేహాన్ని వెలికి తీయగలిగారు. ఈ నౌక జర్మనీ లోని బ్రెమెన్ నుంచి బయలుదేరి యూరప్ రేవు పట్టణం ఇమ్మింఘంకు వెళ్తోంది. మరో పెద్ద నౌక బహమాస్ జెండా కలిగిన పొలిసై .అది నీటిపైనే తేలియాడుతోంది. ఈ నౌకలో 22 మంది ఉన్నారు. అయితే వీరెవరికీ ఎలాంటి గాయాలు తగల లేదు. ఈ నౌక హాంబర్గ్ నుంచి స్పెయిన్ లోని ఎ కొరనా కు వెళ్తోంది. పొలిసై నౌక 100 మీటర్లు (623 అడుగులు) పొడవు, 29 మీటర్ల (95 అడుగులు) వెడల్పు. ఈ నౌకలతోపాటు సహాయ సిబ్బందితో కూడిన నౌకలోనా కూడా ఉండడంతో అవసరమైతే అందులోని డాక్టర్లు వైద్యసాయం అందిస్తారని ఎమర్జెన్సీ కమాండ్ వివరించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News