Monday, December 23, 2024

ఏమైపోయిందిరో.. నా తెలంగాణ..

- Advertisement -
- Advertisement -

ఎక్స్ వేదికగా కిషన్‌రెడ్డి పోస్టు

మనతెలంగాణ/ హైదరాబాద్ : ఏమైపోయిందిరో.. నా తెలంగాణ.. అంటూ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి పోస్టు చేశారు. మంగళవారం ఎక్స్ వేదికగా ఆయన అభిప్రాయాలను వెల్లడించారు. ప్రాజెక్టులు పూర్తయితయ్.. కమీషన్లు జేబుల పడ్తయ్.. వరద రాగానే పంప్‌హౌజ్‌లు మునుగుతున్నయ్.. బాహుబలి మోటర్లు ఈత కొడ్తున్నయ్.. బ్యారేజీలు కుంగుతున్నాయ్! ..ఏమైపోయిందిరో.. నా తెలంగాణ అంటూ ఆయన వ్యాఖ్యానించారు.

అదే విధంగా మరో పోస్టులో కాంగ్రెస్ అంటేనే డబ్బులు పంచడం -ఓట్లు కొనడం అని ఆరోపించారు. మొన్న హిమాచల్ ప్రదేశ్‌లో ఎన్నికలు జరిగితే రాజస్థాన్ నుంచి డబ్బులు సరఫరా.. నిన్న కర్ణాటకలో ఎన్నికలు జరిగితే హిమాచల్ ప్రదేశ్ నుంచి డబ్బులు సరఫరా.. నేడు తెలంగాణలో జరగనున్న ఎన్నికలకు కర్ణాటక నుంచి డబ్బులు సరఫరా అంటూ వ్యాఖ్యానించారు. కర్ణాటకలో ఇటీవల జరిగిన ఐటీ దాడులలో కాంగ్రెస్ నాయకుల ముఖ్య అనుచరుల వద్ద రూ.100 కోట్లకు పైగా డబ్బులు పట్టుబడటం ఇందుకు బలాన్ని చేకూరుస్తోందని అభిప్రాయపడ్డారు.

tweet

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News