Saturday, November 23, 2024

150 వాహనాల ఢీ… ఏడుగురు మృతి

- Advertisement -
- Advertisement -

వాషింగ్టన్: అమెరికాలో దట్టమైన పొగమంచు వాహనదారులకు నరకం చూపింది. లూసియానాలో ఈ వారం ఆరంభంలో కళ్ల ముందున్నది కన్పించని రీతిలో అలుముకున్న పొగమంచుతో అంతరాష్ట్ర రహదారిపై వాహనాలు ఢీకొన్నాయి. ఏదో ఒక చోట ముందు రెండు వాహనాలు ఢీకొనడం వెంటనే వెనుక వస్తున్న దాదాపు 158కి పైగా వాహనాలు ఒకదానితో ఒకటి ఢీకొని చొచ్చుకుపోవడంతో మంటలు చెలరేగాయి. దీనితో ఏడుగురు మృతి చెందినట్లు ప్రాధమిక సమాచారంతో వెల్లడైంది. ఇంటర్‌స్టేట్ 55 హైవేపై న్యూ ఒరేలాన్ ప్రాంతపు పాంట్ చార్ట్రెయిన్ వద్ద జరిగిన ఈ గొలుసుకట్టు ప్రమాదంలో కుప్పలుకుప్పలుగా వాహనాలు పడి ఉన్నాయి.

ఎంత మంది గాయపడ్డారనేది స్పష్టం కాలేదు. దాదాపు అరగంట సేపు ఏదీ కన్పించని స్థితిలో వాహనాల ఢీ చోటుచేసుకున్నాయి. గాయపడ్డ వారి రోదనలు, సహాయక చర్యలు సాగని వైనంతో ఇక్కడ పరిస్థితి దారుణంగా మారింది. ఓ కారు వంతెన దాటి నీటిలోపడింది. 11 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జాం అయింది. పొగమంచుతో ఈ ప్రాంతంలో తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. కానీ ఇంతటి భారీ పొగమంచు ప్రమాదం ఇంతకు ముందెప్పుడూ లేదని స్థానిక రోడ్డు రవాణా అధికారులు తెలిపారు. వాతావరణ శాఖ హెచ్చరికలను విశ్లేషించుకుని పొగమంచు కురిసే ఇటువంటి రహదారులపై రాకపోకలను తాత్కాలికంగా నిషేధించేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News