Monday, December 23, 2024

పెరిగిన చలిగాలులు

- Advertisement -
- Advertisement -

సాధారణ స్థాయి కంటేతగ్గిన ఉష్ణోగ్రతలు

ఉత్తరాది నుండి వీస్తున్న శీతల గాలులు

మనతెలంగాణ/హైదరాబాద్ : నైరుతి రుతుపవనాలు తిరుగుముఖం పట్టడంతో ఉత్తర ఈశాన్య దిశల నుండి కింది స్థాయిలో శీతలగాలులు తెలంగాణ వైపు వీస్తున్నాయి. రాష్ట్రమంతటా చలివాతారణం ఏర్పడింది.పగటి పూట ఉష్ణగ్రతలు కూడా తగ్గుముఖం పట్టగా ,రాత్రి పూట ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయికంటే దిగువకు చేరుకున్నాయి . ఉదయం దట్టమైన పొగమంచు ఏర్పడుతోది. హనుమకొండలో సాధారణం కన్నా 2.7డిగ్రీలు తగ్గిపోయి కనిష్ట ఉష్ణోగ్రత 19.5డిగ్రీలు నమోదయింది. అదిలాబాద్‌లో 1.8డిగ్రీలు తగ్గిపోయి కనిష్టంగా 17.2డిగ్రీలు నమోదయింది. రామగుండం ,మెదక్, హనుమకొండ తదతర ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రతలు తగ్గుతున్నాయి. ఖమ్మం లో సాధారణం కంటే 3.3డిగ్రీలు అధికంగా పెరిగి గరిష్టంగా 35.2డిగ్రీలు నమోదయింది.

హైదరాబాద్ , భద్రాచలం ,అదిలాబాద్‌లో సాధారణం కంటే కొంచెం అధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రా గల 24గంటల్లో ఆకాశం పాక్షికంగా మే ఘావృతమైవుంటుందని హైదరాబాద్ వాతవారణ కేంద్రం వెల్లడించింది. ఉదయం వేళల్లో పొగమంచు పరిస్థితులు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది .గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు వరుసగా 32డిగ్రీలు , 18డిగ్రీలుఉండే అవకాశం ఉంది. ఉపరితల గాలులు గంటకు 08నుంచి 12 కిలోమీటర్ల వేగంతో ఉత్తర ఈశాన్య దిశలనుంచి వీచే అవకాశం ఉంది. తరువాత 48గంటల్లో ఆకాశం పా క్షికంగా మేఘావృతమై ,ఉదయం వేళల్లో పొగమంచు దట్టంగా అలుముకునే అవకాశాలు ఉన్నాయి. గాలిలో తేమ 054శాతం ఉండే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News