హల్దాని: ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి హరీష్ రావత్ ఉధం సింగ్ నగర్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో స్వల్పంగా గాయపడ్డారు. ఆయన ప్రయాణిస్తున్న కారు డివైడర్‌నుఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు హరీష్ రావత్, కొంతమంది పార్టీ కార్యకర్తలతో కలసి మంగళవారం రాత్రి హల్దానీ నుంచి కాశీపూర్ వెలుతుండగా ఈ ప్రమాదం జరిగినట్లు బుధవారం పోలీసులు తెలిపారు. భాజ్‌పూర్ రైల్వే క్రాసింగ్ సమీపంలో ముందు వెళుతున్న వాహనాన్ని ఓవర్‌టేక్ చేసే ప్రయత్నంలో రావత్ ప్రయాణిస్తున్న కారు డ్రైవర్ స్టీరింగ్ పైన అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొన్నట్లు పోలీసులు తెలిపారు.
ముందు సీట్లో కూర్చుని ఉన్న రావత్ ఈ ప్రమాదంలో స్వల్పంగా గాయపడినట్లు వారు చెప్పారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను రావత్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. తాను, తన పార్టీ కార్యకర్తలు సురక్షితంగా ఉన్నట్లు ఆయన తెలిపారు.
हल्द्वानी से काशीपुर को आते वक्त बाजपुर में मेरी गाड़ी थोड़ा सा डिवाइडर से टकरा गई तो थोड़े हल्के-फुल्के झटके लगे हैं, तो उसके लिए हॉस्पिटल में चेकअप करवाया और डॉक्टर्स ने सब ठीक बताया है और डिस्चार्ज कर दिया है।
1/2 pic.twitter.com/DmUMZe88Mb— Harish Rawat (@harishrawatcmuk) October 25, 2023