Monday, December 23, 2024

తనిఖీల్లో రూ.340 కోట్లు స్వాధీనం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : రాష్ట్రంలో శాసనసభ ఎన్నికలకు సంబంధించి ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా పరిధిలో చేపట్టిన తనిఖీల్లో పట్టుబడిన మొత్తం రూ.340 కోట్లు విలువైన నగదు, మద్యం, మత్తు పదార్థాల పట్టుబడినట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. ఈ నెల 9వ తేదీ నుంచి బుధవారం ఉదయం వరకు నగదు : రూ..1,19,44,68,589 కోట్లు పట్టుబడినట్లు తెలిపారు. రూ. 18,67,91,880 విలువైన (మద్యం-78290లీటర్లు,18874కిలోల నల్ల బెల్లం, 655కిలోలఆలం) స్వాధీనం చేసుకున్నారు.

స్వాధీనం చేసుకున్న మొత్తం మత్తు పదార్థాల విలువ : రు.16,94,73,517 ఉండగా.. బంగారు, వెండి వస్తువుల విలువ : రూ.1,56,07,76,979 (230.685కిలోల బంగారం &974.528 కిలోల వెండి, 19071.2576క్యారట్ల వజ్రాలు) కోట్లలో ఉంది. తొమ్మిదో తేదీ నుంచి బుధవారం వరకు రూ. రు.340 కోట్లు విలువైన నగదుతో పాటు ఇతర మొత్తాలను స్వాధీనం చేసుకున్నట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News