Monday, December 23, 2024

పొంగులేటి బంధువు ఇంట్లో లక్షల వాచ్‌లు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : ఎన్నికలు షెడ్యూల్ రావడంతో గత కొన్ని రోజులుగా తెలంగాణ వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. ఓటర్లను ప్రలోభ పెట్టాలని చూస్తే చర్యలు తప్పవని ఎలక్షన్ అధికారులు నాయకులను హెచ్చరించారు. అయినప్పటికీ కోట్లాది రూపాయాలు, మద్యం, ఖరీదైన గిఫ్టులు సీజ్ అవుతున్నాయి. తాజాగా ఖమ్మం మాజీ ఎంపి పొంగులేటి శ్రీనివాసరెడ్డి బంధువు ఇంట్లో వాచ్‌లను ఎన్నికల అధికారులు బుధవారం సీజ్ చేశారు. పొంగులేటి బంధువు తుంబూరు దయాకర్ రెడ్డి ఇంట్లో 9750 వాచ్‌లను ఎన్నికల అధికారులు సీజ్ చేశారు. గతంలో తన కుమార్తె వివాహాన్ని కాంగ్రెస్ నేత పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఘనంగా నిర్వహించారు.

ఆ సమయంలో పెళ్లికి వచ్చిన వారికి ఖరీదైన బహుమతులను ఆయన ప్రదానం చేశారు. కుమార్తె వివాహం సమయంలో పంచగా మిగిలిన వాచీలను బంధువు ఇంట్లో పెట్టామని పొంగులేటి వర్గీయులు చెబుతున్నారు. అయితే ఎన్నికలవేళ ఓటర్లను ప్రభావితం చేసేందుకు ఉపయోగిస్తారేమో అనే ఉద్దేశంతో ఆ వాచ్‌లను అధికారులు సీజ్ చేశారు. సీజ్ చేసిన పొంగులేటికి చెందిన వాచీల విలువ సుమారుగా రూ. 39 లక్షలు ఉంటుందని ఎలక్షన్ అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. ఇటీవల హైదరాబాద్‌లోని బాచుపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో 743 బ్యాగ్‌లలో ఉన్న రూ.2 కోట్లకు పైగా విలువ చేసే చీరలను రెండు లారీల నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్న సంగతి విదితమే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News