Saturday, December 21, 2024

ప్రజా ఆశీర్వాద సభను విజయవంతం చేయండి

- Advertisement -
- Advertisement -
  • రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి

 వనపర్తి ప్రతినిధి: గోపాల్ పేట మండలం ఎదుట్ల గ్రామానికి సాయిరెడ్డి ఎంపిటిసి బాల్ రెడ్డి, పార్టీ ప్రెసిడెంట్ ధర్మయ్య, ఉప సర్పంచ్ క్రాంతి, ఎస్.విష్ణు , ఉడుముల గిరిల ఆధ్వర్యంలో దాదాపు 25 మంది, సాకలి పల్లి గోవుల కుంట తండాకు చెందిన 15 మంది యువకులు బిఆర్‌ఎస్ పార్టీలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి సమక్షంలో జిల్లా కేంద్రంలోని మంత్రి నిరంజన్ రెడ్డి నివాస గృహంలో చేరారు. ముందుగా వారికి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి మంత్రి నిరంజన్‌రెడ్డి సాదరంగా ఆహ్వానించారు. గురువారం జరిగే సీఎం కేసిఆర్ ప్రజా ఆశీర్వాద సభకు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని మంత్రి నిరంజన్ రెడ్డి సూచించారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర సహకార యూనియన్ సభ్యులు తీరుమల మహేష్, రాష్ట్ర మార్కుఫెడ్ డైరెక్టర్ విజయ్‌కుమార్, పట్టణ ఎన్నికల సమన్వయ కర్త అరుణ్ ప్రకాష్, గొర్రెల కాపరుల సంఘం జిల్లా అధ్యక్షుడు కురుమూర్తి యాదవ్, మార్కేట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ మహేశ్వర్‌రెడ్డి, జిల్లా సీనియర్ సమన్వయ సభ్యులు రాములు యాదవ్, జిల్లా రీజనల్ డైరెక్టర్ ఆవుల రమేష్ , నాయకులు నక్క మహేష్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News