Friday, December 20, 2024

గులాబీ ప్రచారానికి ఒయు విద్యార్థి నేతలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : రాష్ట్రంలో ఎన్నికల గడువు సమీపిస్తుండటంతో ఆయా పార్టీలు ప్రచారంలో దూకుడు పెంచాయి. ఈసారి అధికారం దక్కించుకునేందుకు తమకు వచ్చిన విద్యలు ప్రదర్శిస్తూ ఓటర్లను ఆకట్టుకునేందుకు పడరాని తిప్పలు పడుతున్నారు. ఇప్పటికే అధికార బిఆర్‌ఎస్ అభ్యర్థులు ఒక విడుత ప్రచారం నిర్వహించగా, సిఎం కెసిఆర్ మేనిపెస్టో విడుదల చేసి బహిరంగ సభలకు సంబంధించిన షెడ్యూల్ ప్రకటించి 10 నియోజకవర్గాల్లో భారీ బహిరంగ సభలు నిర్వహించి గత రెండు పర్యాలయాల పాలనలో ప్రజలకు అందించిన సంక్షేమ ఫలాలు వివరిస్తూ మరోసారి అధికారం కట్టబెట్టాలని కోరారు. అదే విధంగా కాంగ్రెస్ పార్టీ ఈఎన్నికల్లో అధికారం దక్కకుంటే తెలంగాణలో తమ పార్టీకి భవిష్యత్తు లేదని ఆందోళన చెందుతూ ఆపార్టీకి చెందిన అగ్రనేతలు రాహుల్, ప్రియాంక పాదయాత్రలు, ప్రచార సభలు నిర్వహిస్తూ కాంగ్రెస్‌కు అధికారం ఇవ్వాలంటున్నారు. వీరికంటే తక్కువేమి కాదని రాష్ట్రానికి చెందిన కమలనాథులు కూడా కేంద్రమంత్రులు,

పలు రా ష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులతో పలు నియోజకవర్గాల్లో సభలు నిర్వహిస్తూ ప్రధాని మోడీ రాష్ట్రానికి కేటాయించిన నిధుల, సంక్షేమ పథకాలు వివరిస్తూ బిజెపికి మద్దతు పలకాలని ప్రసంగాలు దంచారు. వీరితో పాటు గులాబీ పార్టీ పెద్దలు గత ఎన్నికల్లో సాధించిన సీట్ల కంటే ఎక్కువగా ఈసారి 100కుపైగా సీట్లు గెలవాలనే లక్షంతో పార్టీ క్యాడర్ కాకుండే విద్యార్ది విభాగానికి చెందిన నాయకులను సైతం బిఆర్‌ఎస్ విజయం కోసం బిఆర్‌ఎస్ విద్యార్థి విభాగం అధ్యక్షులు గెల్లు శ్రీనివాస్‌యాదవ్ ఆధ్వర్యంలో 12 యూనివర్శిటీలకు చెందిన 5 వేల మంది ప్రచారం చేసేందుకు సిద్దమైన్నట్లు ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్ధి నాయకులు పేర్కొంటున్నారు. నవంబర్ 1వ తేదీ నుంచి జిల్లాల వారీగా బృందాలను ఏర్పాటు చేసి, అక్కడ నుంచి నియోజకవర్గాల వారీగా విద్యార్థులంతా వెళ్లి ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు వివరించనున్నారు. అదే విధంగా ముఖ్యమంత్రి కెసిఆర్ పోటీ చేసే గజ్వేల్, కామారెడ్డిలో భారీ మెజార్టీతో విజయం సాధించే విధంగా గెల్లు శ్రీనివాస్‌యాదవ్ ప్రత్యేక దృష్టి సారించి లక్షపైగా మెజార్టీతో గెలిచేలా

తమ వంతు కృషి విపక్ష పార్టీలకు దిమ్మతిరిగేలా చేసేందుకు ప్లాన్ చేసినట్లు చెబుతున్నారు. బిఆర్‌ఎస్ మూడోసారి అధికారం చేపట్టేందుకు తమ శాయశక్తుల కృషి చేస్తామని స్వరాష్ట్రం ఏర్పడిన తరువాత పేదల విద్యార్థుల కోసం గురుకుల పాఠశాలతో ఇంటర్, డిగ్రీ కళాశాల ఏర్పాటు, అదే విధంగా జిల్లాకు ఒక మెడికల్ కళాశాల, మంత్రి కెటిఆర్ ఐటీ కంపెనీలు తెలంగాణకు తీసుకొచ్చి లక్షలాది మంది ఇంజనీరింగ్ విద్యపూర్తి చేసిన విద్యార్థులకు ఉద్యోగాలు కల్పించినట్లు చెప్పారు. 50 కాంగ్రెస్ పాలనలో చేయని ఉద్యోగాలు ఐదేళ్లలో బిఆర్‌ఎస్ ప్రభుత్వంలో లభించాయన్నారు. మూడోసారి సిఎం కెసిఆర్ పదవి చేపడితే విదేశాల్లో ఉన్న నిరుద్యోగ యువత తెలంగాణకు వచ్చే పరిస్దితి వస్తుందని, రాష్ట్ర ప్రజలు ప్రజా సంక్షేమ పాలన అందిస్తున్న బిఆర్‌ఎస్ అధికారం కట్టబెట్టాలని కోరారు. ఎన్నికల ప్రచారంలో తమదైన శైలిలో ప్రచారం నిర్వహించిన బిఆర్‌ఎస్ అభ్యర్థుల గెలుపుకు ముందు వరుసలో ఉంటామని ఓయూ విద్యార్ధి నాయకులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News