Monday, December 23, 2024

దూసుకుపోతోన్న టైగర్ 3 ఫస్ట్ సింగిల్

- Advertisement -
- Advertisement -

బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్‌లు నటించిన ‘టైగర్ 3’ నుంచి వచ్చిన ఫస్ట్ సింగిల్ ‘లేకే ప్రభు కా నామ్’ యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతోంది. ప్రీతమ్ ట్యూన్, అర్జిత్ సింగ్ నికిత గాంధీ‌లు హిందీలో ఆలపించిన తీరు.. బెన్ని దయాల్, అనుష మణి తెలుగు, తమిళంలో ఆలపించిన విధానంకు శ్రోతలు ఫిదా అయ్యారు. సల్మాన్ ఖాన్, కత్రినా కెమిస్ట్రీ ఆడియెన్స్‌కి తెగ నచ్చేసింది. ఈ పాట యూట్యూబ్‌లో ఇన్‌స్టంట్‌గా హిట్ అయింది. ఇప్పటికే 25 మిలియన్ల వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

ఈ సందర్భంగా సల్మాన్ ఖాన్ తన సంతోషాన్ని వ్యక్తపరుస్తూ.. ‘ఈ హాలీడే సీజన్‌లో ఓ పార్టీ ఆంథమ్‌లా ఈ పాటను ఎంజాయ్ చేస్తున్నారని తెలిసి నాకు ఎంతో సంతోషంగా ఉంది. నా సినిమాలు, అందులోని పాటలు ఆడియెన్స్‌ను అలరిస్తుంటే నాకు ఎంతో ఆనందంగా ఉంటుంది. ప్రేక్షకులు అన్ని మరిచిపోయి ఇలా నా పాటలు, సినిమాలు ఎంజాయ్ చేయడమే నాకు కావాలి. అందులోనే నాకు తృప్తి ఉంటుంది.

పాటలు, డ్యాన్సులు అనేవి మా సినిమాలో ఓ భాగం, మన సంప్రదాయాల్లో భాగం. నా సినిమాలోని పాటలను ఆడియెన్స్ ఎంజాయ్ చేస్తే నాకు ఎంతో ముచ్చటేస్తుంటుంది.  అలా నా కెరీర్‌లో ఎన్నో మరుపురాని పాటలు ఉండటం నా అదృష్టం. లేకే ప్రభు కా నామ్ పాట కూడా త్వరలోనే ఆ లిస్ట్‌లోకి చేరుతుందని ఆశిస్తున్నా’ అని అన్నారు.

కత్రినా కైఫ్ మాట్లాడుతూ.. ‘ప్రేక్షకుల నుంచి ప్రేమ వచ్చినప్పుడే అది నిజమైన సక్సెస్ అవుతుంది. లేకే ప్రభు కా నామ్ పాట ఇంత పెద్ద ఎత్తున సక్సెస్ అవ్వడం మా టీంకు ఎంతో ఆనందంగా ఉంది. పాట అయినా, సినిమా అయినా జనాలకు కనెక్ట్ అయినప్పుడే పెద్ద హిట్ అవుతుంది. సినిమాలోని నా నటనతో పాటుగా, పాటల కోసం జనాలు ఎంతో వెయిట్ చేస్తున్నారని నాకు తెలుసు. పాటలు, డ్యాన్సులు అనేవి మన సంప్రదాయంలో భాగమే. నేను బాగా డ్యాన్స్ చేస్తాననే కాంప్లిమెంట్‌ నాకు ఎంతో ఇష్టం. మా నుంచి పాట వస్తుందంటే ప్రేక్షకుల్లో ఎలాంటి అంచనాలుంటాయో మాకు తెలుసు. ఇలాంటి ప్రశంసలు వచ్చినప్పుడే మాకు ఎంతో ప్రోత్సాహం లభించినట్టుగా అనిపిస్తుంది’ అని అన్నారు. వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్ నుంచి టైగర్ 3 రాబోతోంది. ఆదిత్య చోప్రా నిర్మిస్తుండగా.. మనీష్ శర్మ తెరకెక్కించాడు. దీపావళి సందర్భంగా నవంబర్ 12న ఈ చిత్రం హిందీ, తమిళ, తెలుగు భాషల్లో రిలీజ్ కాబోతోంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News