Monday, January 20, 2025

సౌతాఫ్రికాతో కీలక మ్యాచ్..5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పాక్

- Advertisement -
- Advertisement -

ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023 లీగ్ దశలో భాగంగా ఎంఏ చిదంబరం స్టేడియంలో సౌతాఫ్రికా, పాకిస్థాన్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాక్ మరోసారి తడబడుతోంది. ఓపెనర్లతోపాటు భారీ అంచనాలున్న రిజ్వాన్(31), ఇఫ్తికర్ అహ్మద్(21)లు కూడా విఫలమయ్యారు.

ఈ క్రమంలో జట్టు పతనాన్ని అడ్డుకుని.. మళ్లీ రేసులో నిలిపేందుకు కెప్టెన్ బాబర్ అజమ్ ధాటిగా బ్యాటింగ్ చేసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. అయితే, అర్థ శతకం పూర్తి చేసిన వెంటనే బాబర్ ఔట్ కావడంతో.. పాక్ 5 కీలక వికెట్లు కోల్పోయిన కష్టాల్లో పడింది. ప్రస్తుతం పాకిస్థాన్ 29 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 148 పరుగులు చేసింది. క్రీజులో షకీల్(13), షాబాద్(1)లు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News