కారేపల్లి: మనకు మంచి జరగాలంటే ఆలయానికి వెళ్లి దేవుడికి దండం పెట్టుకొని, మన కోరికలను తీర్చమని ఆలయంలో ఉండే పూజారి పూజలు చేస్తాడు. అటువంటి పూజారి నేడు అనారోగ్యంతో బాధపడుతూ ఆర్థిక సహాయం కోసం దీనంగా ఎదురు చూస్తున్న వైనమిది. మండల కేంద్రమైన కారేపల్లి గ్రామానికి చెందిన పూజారి గుండు రామచంద్రమూర్తి అంటే తెలియని వారు దాదాపుగా ఉండరు. సుమారు 40 సంవత్సరాలుగా పౌరోహిత్యాన్ని నమ్ముకొని కారేపల్లి రైల్వే స్టేషన్ రోడ్ లోని శివాలయంలో పూజారిగా పనిచేస్తున్నారు. సుమారు గత రెండేళ్ల క్రితం అనారోగ్యానికి గురి కావడంతో గుండెకు శస్త్ర చికిత్స చేశారు. అనంతరం యధావిధిగా ఆలయంలో విధులు నిర్వహించేవారు. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం తీవ్ర అనారోగ్యానికి గురి కావడంతో హైదరాబాదులోని వైద్యశాలకు తరలించారు. పరీక్షించిన వైద్యులు రామచంద్రమూర్తికి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినట్లుగా నిర్ధారించి చికిత్స చేశారు.
ఆర్థిక పరిస్థితి సరిగా లేని రామచంద్రమూర్తి కుటుంబం ఇప్పటికే 6 లక్షల 50 వేల రూపాయలు ఖర్చు చేసి వైద్యం అందజేస్తున్నారు. మరొక 15లక్షల వరకు వైద్య ఖర్చులు అవుతాయని వైద్యులు చెపుతున్నట్లు రామచంద్ర మూర్తి భార్య హైమావతి పేర్కొన్నారు. దాతలు సహాయం చేయాలని కోరుతూ కొంతమంది మానవతా వాదులు సామాజిక మాధ్యమాలలో పోస్ట్ చేయడంతో పలువురు స్పందించారు. వైద్య ఖర్చులకు డబ్బులు అవసరమయ్యే నిమిత్తం దాతల సహాయం కోసం కుటుంబ సభ్యులు ఎదురుచూస్తున్నారు. సహాయం చేయవలసిన దాతలు కారేపల్లి స్టేట్ బ్యాంక్ హైదరాబాద్, ఖాతా సంఖ్య 20030960932(ఎస్బిఐ) ఐఎఫ్‌ఎస్సి కోడ్ ఎస్ బి ఐ ఎన్ 0020556, ఫోన్ పే, గూగుల్ పే చేయదలచిన వారు 8886887818 (హైమవతి) నెంబర్ కు చేయగలరని దీనంగా కోరుతున్నారు.