Monday, November 18, 2024

హవాలా డబ్బులు పట్టివేత..

- Advertisement -
- Advertisement -

సిటిబ్యూరోః హవాలా డబ్బులు తరలిస్తున్న ఓ వ్యక్తిని సెంట్రల్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. ఆధారాలు చూపని రూ.19,80,000ను పోలీసులు సీజ్ చేశారు. పోలీసుల కథనం ప్రకారం…భువనగిరి జిల్లా, పల్లెర్ల గ్రామానికి చెందిన రాపోలు నరేష్ ఉప్పల్‌లో ఉంటూ నవసహస్రా ఇన్‌ఫ్రా డెవలపర్స్‌లో సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్నాడు. కంపెనీ యజమాని ఆదేశాల మేరకు తరచూ హవాలా పనులు చేస్తుంటాడు. దానికి గాను కమీషన్ తీసుకుని ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి నగదును తరలిస్తున్నాడు. తమ కంపెనీ యజమాని మహేష్ కుమార్ ఆదేశాల మేరకు

లిబర్టీ వద్ద ఓ వ్యాపారి నుంచి రూ.19.80లక్షల నగదును తీసుకుని బైక్‌పై తీసుకుని కస్టమర్‌కు ఇచ్చేందుకు వస్తున్నాడు. ఈ క్రమంలోనే సెంట్రల్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు గురువారం రాత్రి వాహనాల తనిఖీ చేపట్టారు. నరేష్‌ను ఆపిన పోలీసులు బైక్‌పై తరలిస్తున్న నగదును స్వాధీనం చేసుకున్నారు. వాటికి సంబంధించిన వివరాలు చెప్పాలని కోరగా ఎలాంటి ఆధారాలు చూపలేకపోయాడు. దీంతో పోలీసులు నగదును స్వాధీనం చేసుకుని ఐటి అధికారులకు అప్పగించారు. ఇన్స్‌స్పెక్టర్ రాజు నాయక్, ఎస్సై సాయికిరణ్, నవీన్‌కుమార్ తదితరులు పట్టుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News