Monday, January 20, 2025

నియోజకవర్గ ప్రజల ఒత్తిడి మేరకే మళ్లీ కాంగ్రెస్ పార్టీలో చేరా: రాజగోపాల్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

నాకు పదవులు ముఖ్యం కాదు
మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

మనతెలంగాణ/హైదరాబాద్ : తనకు పదవులు ముఖ్యం కాదని, నియోజకవర్గ ప్రజల ఒత్తిడి మేరకే తాను మళ్లీ కాంగ్రెస్ పార్టీలో చేరానని మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పేర్కొన్నారు. బిజెపిని వీడి కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్న రాజగోపాల్ రెడ్డి శుక్రవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తాను పార్టీ మారడం వెనుక ఉన్న కారణాలను వివరించారు.

కాంగ్రెస్ పార్టీలో చేరాలని మునుగోడు ప్రజలు తనపై ఒత్తిడి చేశారని ఆయన చెప్పారు. ప్రజాభీష్టం మేరకు వంద అడుగులైనా వెనక్కి వేసేందుకు తాను సిద్ధంగా ఉంటానని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తంచేశారు. కాంగ్రెస్ పార్టీ 70- నుంచి 80 సీట్లు గెలుస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ఆధ్వర్యంలో సామాజిక తెలంగాణ రాబోతోందని కోమటిరెడ్డి వ్యాఖ్యానించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News