Tuesday, December 24, 2024

ప్రజాసేవలో సింగిరెడ్డి సోమశేఖర్‌రెడ్డి

- Advertisement -
- Advertisement -

యువసేన ఫౌండేషన్ ద్వారా సామాజిక సేవా కార్యక్రమాలు

1993లో తన రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టిన సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీలో వివిధ కీలక పదవుల్లో పార్టీకి సేవలందించారు. విద్యార్థి సంఘంలో పనిచేయడంతో పాటు యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్‌గా, మల్కాజిగిరి పార్లమెంటరీ యూత్ కాంగ్రెస్ ఎలెక్టెడ్ ప్రెసిడెంట్‌గా, టిపిసిసి సెక్రెటరీగా కాంగ్రెస్‌లో కొనసాగారు. 2002లో యువసేన ఫౌండేషన్ ప్రారంభించిన సోమశేఖర్ రెడ్డి ఆ ఫౌండేషన్ ద్వారా సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించారు.

యువసే ఫౌండేషన్ ద్వారా ఉప్పల్‌లో మంచినీళ్లు లేని ప్రాంతాలలో మినరల్ వాటర్ ప్లాంట్ పెట్టి ప్రజలకు రక్షిత త్రాగునీటిని సరఫరా చేస్తున్నారు. ఈ ఫౌండేషన్ ద్వారా గుండె జబ్బులు వచ్చిన నిరుపేదలకు ఉచితంగా సర్జరీలు చేయడంతోపాటు అవసరమైన వైద్య సేవలను అందిస్తున్నారు. కొవిడ్ సమయంలో రూ.6 కోట్లు ఖర్చు చేసి ప్రజలకు సేవలందించారు. ఆ సమయంలో జాతీయ మీడియా కూడా సోమశేఖర్ రెడ్డిపై కవర్ స్టోరీ చేసింది. ఉప్పల్‌లో ఆయనకు ఉన్న బలం చూస్తే ఎ.ఎస్.రావు నగర్ నుండి సోమశేఖర్ రెడ్డి సతీమణి శిరీష పోటీ చేయగా, ప్రత్యర్థి పార్టీలకు డిపాజిట్లు కూడా రాలేదు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News