Monday, January 20, 2025

సౌతాఫ్రికా ఉత్కంఠ విజయం

- Advertisement -
- Advertisement -

ఇక పాకిస్థాన్‌కు సెమీస్ ఛాన్స్ కష్టమే!

చెన్నై : పాకిస్థాన్‌తో శుక్రవారం ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో సౌతాఫ్రికా ఒక వికెట్ తేడాతో విజయం సాధించింది. ఈ ఓటమితో పాకిస్థాన్ సెమీ ఫైనల్ ఆశలకు దాదాపు తెరపడినట్టే చెప్పా లి. తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 46.4 ఓవర్లలో 270 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ బాబర్ ఆజమ్ (50), వికెట్ కీపర్ రిజ్వాన్ (31), సౌద్ షకిల్ (52), షాదాబ్ ఖాన్ (43), మహ్మద్ నవా జ్ (24), ఇఫ్తికార్ అహ్మద్ (21) పరుగులు చేశా రు. ప్రత్యర్థి జట్టు బౌలర్లలో తబ్రేస్ షమ్సి నాలు గు, జాన్సెన్ మూడు, కొయెట్జి రెండు వికెట్లు తీశారు.

తర్వాత బ్యాటింగ్‌కు దిగిన సౌతాఫ్రికా 47.2 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుంది. ఐడెన్ మార్‌క్రమ్ అద్భుత బ్యాటింగ్‌తో జట్టును ఆదుకున్నాడు. పాక్ బౌలర్లను దీటుగా ఎదుర్కొన్న మార్‌క్రమ్ ఏడు ఫోర్లు, 3 సిక్సర్లతో 91 పరుగులు చేశాడు. అయితే అతను కీలక సమయంలో ఔట్ కావడంతో సౌతాఫ్రికా కష్టాలు చిక్కుకుంది. ఒక దశలో 235/5తో పటిష్టస్థితిలో ఉన్న సౌతాఫ్రికా ఆ తర్వాత వరుస క్రమంలో వికెట్లను కోల్పోయింది. పాక్ బౌలర్లు అద్భుత బౌలింగ్‌తో జట్టును మళ్లీ మ్యాచ్‌లోకి తీసుకెళ్లారు. అయితే కేశవ్ మహారాజ్ 7 (నాటౌట్), షమ్సి 4 (నాటౌట్) సమన్వయంతో ఆడి సౌతాఫ్రికా చిరస్మరణీయ విజయాన్ని అందించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News