- Advertisement -
తిరుమల: అలిపిరి నడకమార్గంలో మళ్లీ చిరుత పులి, ఎలుగుబంటి సంచారం కలకం సృష్టిస్తోంది. నరసింహస్వామి ఆలయం నుంచి 7వ మైలు ప్రాంతంలో చిరుత, ఎలుగు బంటి సంచారాన్ని అటవీ శాఖ అధికారులు గుర్తించారు. మూడు రోజులుగా వేకుజామున రాత్రి సమయాల్లో చిరుత, ఎలుగుబంటి సంచరిస్తోంది. గతంలో దాడులు చేసిన ప్రాంతాల్లోనే రెండు చిరుతలను సంచారాన్ని గుర్తించారు. భక్తుల భద్రత దృష్ట్యా భద్రతా సిబ్బందిని టిటిడి అప్రమత్తం చేసింది. రాత్రి సమయంలో నడకదారి భక్తులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
- Advertisement -