- Advertisement -
తిరుపతి: తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. 31 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి వున్నారు. సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనానికి ఐదు గంటల సమయం పడుతోంది. శుక్రవారం శ్రీవారిని 63,404 మంది భక్తులు దర్శించుకున్నారు. 26,659 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.42 కోట్లుగా ఉంది.
- Advertisement -