Friday, November 22, 2024

కేంద్ర మంత్రి అమిత్ షా బిసి సిఎం ప్రకటన హర్షణీయం

- Advertisement -
- Advertisement -

బిసి ప్రధాని,ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలను రాష్ట్రపతి చేసిన చరిత్ర బిజెపిదే
అగ్ర కులాల పేదలకు రిజర్వేషన్లు అందిస్తున్న మోడీ సర్కార్
సబ్బండ వర్గాల పక్షాన పోరాడుతున్న చరిత్ర బిజెపి సొంతం
బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపి బండి సంజయ్ కుమార్

మన తెలంగాణ/ హైదరాబాద్:  తెలంగాణలో బిజెపి అధికారంలోకి వస్తే బిసి అభ్యర్థే ముఖ్యమంత్రి అవుతారంటూ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రకటనను స్వాగతిస్తున్నామని ఆపార్టీ జాతీయ కార్యదర్శి ఎంపి, బండి సంజయ్‌కుమార్ పేర్కొన్నారు. శనివారం ఒక ప్రకటనలో వెల్లడిస్తూ తెలంగాణలోని బడుగు, బలహీనవర్గాల ప్రజలంతా హర్షం వ్యక్తం చేస్తున్నారని, రాష్ట్ర ప్రజల పక్షాన ప్రధానమంత్రి మోదీ, పార్టీ జాతీయ అధ్యక్షులు జెపి నడ్డాకు ధన్యవాదాలు తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ చరిత్రలో అధికారం చేపట్టిన ఏ పార్టీ కూడా ఇప్పటి వరకు బీసీలకు పెద్ద పీట వేసిన దాఖలాలేవని, బీసీ సబ్ ప్లాన్ నిధులను కేటాయించిన చరిత్ర లేదన్నారు. అధికారంలోకి వస్తే బిసి వ్యక్తినే సిఎం చేస్తామంటూ హామీ ఇవ్వలేదని, ఇప్పటి వరకు రాష్ట్రాన్ని పాలించిన పార్టీలు బీసీలకు ఎంతో అన్యాయం చేశాయని, బిసిల్లోని సగం కులాలు నేటికీ చట్ట సభల్లో అడుగు పెట్టలేని దుస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. బిసి నాయకుడు సిఎం అయితే తెలంగాణ జనాభాలో సగానికిపైగా ఉన్న బిసిలు అన్ని రంగాల్లో అభివృద్ది చెందే అవకాశముందని నేటికీ చట్టసభల్లో అడుగుపెట్టని బిసిల్లోని కులాల వ్యక్తులకు తగిన ప్రాధాన్యత లభించే అవకాశముందన్నారు.

దేశంలోని అన్ని వర్గాల అభ్యున్నతికి అహర్నిశలు పాటుపడుతున్న ఏకైక పార్టీ బిజెపి మాత్రమే. అకాశంలో సగభాగమైన మహిళలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించకుండా కాంగ్రెస్, మజ్లిస్ కుట్రలు చేస్తే వాటిని చేధిస్తూ చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లను మహిళలకు కల్పించడంతో పాటు బిసి వ్యక్తిని ప్రధానమంత్రిని చేసిన ఘనత కూడా బిజెపికే దక్కిందన్నారు. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వ్యక్తులను అత్యున్నతమైన రాష్ట్రపతి పదవిని కట్టబెట్టిన చరిత్ర తమ పార్టీకే సొంతమని, ట్రిపుల్ తలాఖ్ చట్టాన్ని రద్దు చేసి ముస్లిం మహిళలకు న్యాయం చేసిందన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలతోపాటు ఆర్ధికంగా వెనుకబడిన అగ్రవర్ణాల పేదలకు రిజర్వేషన్లు కల్పిస్తూ వారి అభ్యున్నతికి పాటుపడుతున్న ఏకైక రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ మాత్రమేనని పేర్కొన్నారు. తెలంగాణలో సబ్బండ వర్గాల ప్రజలు తమ పార్టీకి వచ్చే ఎన్నికల్లో అధికారం కట్టబెట్టాలని కోరారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News