Monday, January 20, 2025

దారి దోపిడీ కేసులో కానిస్టేబుల్‌ సర్వీస్‌ నుంచి తొలగింపు

- Advertisement -
- Advertisement -

సిటిబ్యూరోః దారి దోపిడీ కేసులో అరెస్టైన కానిస్టేబుల్‌ను సర్వీస్ నుంచి తొలగిస్తు రాచకొండ పోలీస్ కమిషనర్ డిఎస్ చౌహాన్ శనివారం ఆదేశాలు జారీ చేశారు. పోలీసుల కథనం ప్రకారం…రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఎఆర్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న 2018కు బ్యాచ్‌కు చెందిన బళ్లారి శ్రీకాంత్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. మెహిదీపట్నంలోని ఓ టెక్స్‌టైల్స్ షాప్ ఉద్యోగి ప్రదీప్ శర్మ తన యజమాని ఇచ్చిన రూ.20లక్షలను బ్యాంక్‌లో డిపాజిట్ చేసేందుకు ఈ నెల 26వ తేదీన సంస్థకు చెందిన కారులో వెళ్తున్నాడు. తాజ్‌కృష్ణ వద్ద పోలీస్ పెట్రోలింగ్ వాహనంలో మరో వ్యక్తితో వచ్చిన కానిస్టేబుల్ శ్రీకాంత్ కారును ఆపాడు.

ఎన్నికల విధుల్లో భాగంగా తనిఖీలు నిర్వహించాలని చెప్పాడు. కారు ఆపడంతో తనిఖీ చేస్తుండగా ఈ ముఠాకు చెందిన మిగతా వారు అక్కడికి వచ్చి ప్రదీప్ శర్మ దృష్టి మరల్చి రూ.18.50లక్షలు కొట్టేశారు. తర్వాత బాధితుడు చూసి సంస్థ యజమానికి చెప్పడంతో పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించాడు. ప్రదీప్ శర్మ పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సిసిటివి ఫుటేజ్ ఆధారంగా కానిస్టేబుల్ శ్రీకాంత్‌ను గుర్తించి అరెస్టు చేశారు. మిగతా వారి కోసం గాలిస్తున్నారు, కానిస్టేబుల్ రాచకొండలో పనిచేస్తున్నట్లు తెలియడంతో పంజాగుట్ట పోలీసులు సమాచారం ఇచ్చారు. దీంతో కానిస్టేబుళ్ బళ్లారి శ్రీకాంత్‌ను సర్వీస్ నుంచి రిమూవ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News