- Advertisement -
న్యూఢిల్లీ : గాజాపై ఇజ్రాయెల్ దాడికి వ్యతిరేకంగా ఐక్యరాజ్యసమితిలో తీసుకొచ్చిన తీర్మానంపై ఓటింగ్‌కు భారత్ దూరంగా ఉండడాన్ని ఉభయ కమ్యూనిస్టు పార్టీలు తీవ్రంగా విమర్శించాయి.. ఈ వైఖరి తీవ్రమైన షాక్ కలిగించిందని, భారత్ విదేశాంగ విధానం అమెరికా సామ్రాజ్యవాదానికి దాసోహం అయినట్టు కనిపించిందని శనివారం సిపిఎం, సిపిఐ సంయుక్త ప్రకటనలో ధ్వజమెత్తాయి. గాజాలో మారణహోమాన్ని, దురాక్రమణను ఆపాలి అన్న శీర్షికతో వెలువడిన ఈ ప్రకటనలో సుదీర్ఘకాలంగా పాలస్తీనాకు భారత్ మద్దతు ఇచ్చే విధానాన్ని ఇప్పుడు భారత్ వ్యతిరేకిస్తున్నట్టు సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం యేచూరి, సిపిఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా విమర్శించారు. పాలస్తీనాకు సంఘీభావం తెలియజేస్తూ ఆదివారం ఎకెజి భవన్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తామని ప్రకటించారు.
- Advertisement -