Friday, December 20, 2024

బంగ్లాదేశ్‌పై నెదర్లాండ్స్ ఘన విజయం

- Advertisement -
- Advertisement -

కోల్‌కతా: ప్రపంచకప్‌లో నెదర్లాండ్స్ మరో సంచలనం నమోదు చేసింది. శనివారం ఈడెన్ గార్డెన్స్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో నెదర్లాండ్స్ 87 పరుగులు తేడాతో ఘన విజయం సాధించింది. ఈ టోర్నీలో నెదర్లాండ్స్‌కు ఇది రెండో విజయం కావడం విశేషం. ఇంతకుముందు ప్రపంచ ఛాంపియన్ ఇంగ్లండ్‌ను కూడా ఆరేంజ్ ఆర్మి మట్టికరిపించిన విషయం తెలిసిందే. తొలుత బ్యాటింగ్ చేసిన నెదర్లాండ్స్ 229 పరుగులకు ఆలౌటైంది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్ 42.2 ఓవర్లలో కేవలం 142 పరుగులకే కుప్పకూలి ఘోర పరాజయాన్ని చవిచూసింది.

బంగ్లాదేశ్‌కు ఇది వరుసగా ఐదో ఓటమి కావడం గమనార్హం. తొలి మ్యాచ్‌లో అఫ్గాన్‌పై గెలిచిన బంగ్లాదేశ్ ఆ తర్వాత ఆడిన ఐదు పోటీల్లో పరాజయం చవిచూసింది. ఈ మ్యాచ్‌లో స్వల్ప లక్ష్యాన్ని కూడా ఛేదించలేక చేతులెత్తేసింది. నెదర్లాండ్స్ బౌలర్లలో పాల్ మీకెరనఖ్ నాలుగు, బాస్ డీ లీడ్ రెండు వికెట్లు తీశారు. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన నెదర్లాండ్స్‌ను కెప్టెన్ ఎడ్వర్డ్ (68), బర్రెసి (41) పరుగులు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News