Saturday, November 23, 2024

డిసెంబర్‌లో బిఎస్‌ఎన్‌ఎల్ 4జి సేవలు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న బిఎస్‌ఎన్‌ఎల్ 4జి సేవలు త్వరలో ప్రారంభం కానున్నాయి. ఈ ఏడాది డిసెంబర్‌నుంచి ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయని ఆ సంస్థ సిఎండి అశోక్ పుర్వార్ తెలిపారు. తొలుత పంజాబ్‌నుంచి ఈ సేవలను ప్రారంభిస్తామని చెప్పారు. ఢిల్లీలో జరుగుతున్న ఇండియన్ మొబైల్ కాంగ్రెస్‌లో భాగంగా ఆయన శనివారం మీడియాతో మాట్లాడారు. బిఎస్‌ఎన్‌ఎల్ 4జికి సంబంధించి ఇప్పటికే 200 ప్రదేశాల్లో విజయవంతంగా ప్రయోగాలు నిర్వహించినట్లు ఆయన చెప్పారు.

తొలి దశలో పంజాబ్‌లోని కొన్ని ప్రాంతాల్లో ఈ సేవలను ప్రారంభించి తర్వాత దశలవారీగా మిగతా ప్రాంతాలకు విస్తరిస్తామని తెలిపారు. వచ్చే ఏడాది జూన్ నాటికల్లా దేశవ్యాప్తంగా 4జి సేవలను అమలు చేయాలని లక్షంగాపెట్టుకున్నట్లు పుర్వార్ చెప్పారు.4 జి విస్తరణ పూర్తయ్యాక 5జి సేవలను ప్రారంభిస్తామని చెప్పారు. దేశీయంగా అభివృద్ధి చేసిన టెక్నాలజీని 4జి కోసం వినియోగించినట్లు పుర్వార్ తెలిపారు. 4జి నెట్‌వర్క్‌ను 5జికి అప్‌గ్రేడ్ చేసే బాధ్యతను ప్రముఖ ఐటి కంపెనీ టిసిఎస్‌కు, ప్రభుత్వ రంగ ఐటిఐకి అప్పగించిన విషయం తెలిసిందే.5జి సేవలను ప్రారంభించేందుకు అవసరమైన స్పెక్ట్రమ్ అందుబాటులో ఉందని కూడా పుర్వార్ చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News